బీహార్ లోని పాట్నాలో ఉన్న ఒక కోవిడ్-19 హాస్పిటల్ లోని పరిస్థితి అని చెప్తూ, ఒక హాస్పిటల్ వార్డు లోకి మోకాళ్ళ లోతు నీళ్ళు వచ్చిన వీడియోని కొంత మంది సోషల్ మీడియా షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: బీహార్ లోని పాట్నాలో ఉన్న ఒక కోవిడ్-19 హాస్పిటల్ లోని పరిస్థితి.
ఫాక్ట్ (నిజం): అది ఒక పాత వీడియో. అదే వీడియో సెప్టెంబర్ 2019 నుండి బీహార్ కి చెందిన హాస్పిటల్ వీడియోగా ఇంటర్నెట్ లో షేర్ అవుతుంది. అంటే, కోవిడ్-19 వ్యాధి రాక ముందు వీడియో అది. కావున, బీహార్ కి సంబంధించిన పాత వీడియోని పెట్టి, కోవిడ్-19 సమయంలో జరిగిన ఘటనగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
పోస్ట్ లోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే వీడియోని కొందరు సెప్టెంబర్ 2019 లోనే తమ ట్విట్టర్ అకౌంట్లలో పోస్ట్ చేసినట్టు ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. ఒక వ్యక్తి తన ట్వీట్ లో ఆ వీడియో పాట్నాలోని ‘ఎన్ఎంసీహెచ్’ హాస్పిటల్ (‘నలంద మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్’) కి సంబంధించిన వీడియో అని పెట్టాడు. వీడియోలో కూడా అది ‘ఎన్ఎంసీహెచ్’ కి సంబంధించిన వీడియో అని ఒక వ్యక్తి చెప్పడం వినొచ్చు. అదే వీడియోని పెట్టి, కొన్ని వార్తాసంస్థలు కూడా సెప్టెంబర్ 2019 లోనే పాట్నా లో వచ్చిన వర్షాల గురించి ప్రచురించినట్టు ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. కాబట్టి, పోస్ట్ లోని వీడియో కోవిడ్-19 వ్యాధి రాక ముందు తీసినది.
అయితే, తాజాగా జూన్ నెలలో కూడా అదే ఆసుపత్రి లోకి కొన్ని నీరు వచ్చాయని ‘ఏబీపీ’ న్యూస్ ఛానల్ వారు రిపోర్ట్ చేసారు. కానీ, వీడియోలో చూపెట్టినట్టు మోకాళ్ళ లోతు నీరు రాలేదు.
చివరగా, పాత వీడియో పెట్టి, పాట్నా (బీహార్) లోని కోవిడ్-19 హాస్పిటల్ పరిస్థితి అని షేర్ చేస్తున్నారు.