Fake News, Telugu
 

2019 ర్యాలీ వీడియోని రైతులకి వ్యతిరేకంగా ఢిల్లీ ప్రజలు రోడ్ల పై నిరసన చేస్తున్న వీడియో అని షేర్ చేస్తున్నారు

0

రైతుల ముసుగులో వచ్చి పోలీసుల మీద దౌర్జన్యం చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని, ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోని షేర్ చేస్తున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుక నాడు నిర్వహించిన కిసాన్ ట్రాక్టర్ పెరేడ్ లో రైతులు పోలీసుల పై దాడి చేసిన నేపథ్యంలో, ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: రైతులకి వ్యతిరేకంగా ఢిల్లీ ప్రజలు రోడ్ల పై నిరసన చేస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో పాతది. 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన CAA, NRC చట్టాలని సమర్ధిస్తూ హర్యానా ప్రజలు ఈ ర్యాలీ నిర్వహించారు. CAA, NRC చట్టాలకి వ్యతిరేకంగా నిరసనకారులు ఢిల్లీ లో నిరసన తెలియచేస్తున్న నేపథ్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ వీడియోకి ఇటివల రైతులు నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీకి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, 2019లో ఇదే వీడియోని చాలా మంది తమ సోషల్ మీడియా అకౌంట్లలో పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఆ పోస్టులని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఇవే దృశ్యాలు కలిగిన వీడియోలని 2019లో కొందరు తమ యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేసారు. ఒక వీడియో వివరణలో, ఈ ర్యాలీ CAA, NRC చట్టాలని సమర్ధిస్తూ హర్యానా ప్రజలు నిర్వహించిందని తెలిపారు.

హర్యానా బిజెపి నాయకుడు జవహర్ యాదవ్, ఈ వీడియోని షేర్ చేస్తూ 26 డిసెంబర్ 2019 నాడు ఒక ట్వీట్ పెట్టారు.  ఈ ర్యాలీ హర్యానా లో జరిగినట్టు ఆ ట్వీట్ లో తెలిపారు.

జవహర్ యాదవ్ పెట్టిన ఈ ట్వీట్ ఆధారంగా ‘Lokmat’ న్యూస్ వెబ్ సైట్ 27 డిసెంబర్ 2019 నాడు ఒక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. CAA, NRC చట్టాలకి మద్దతుగా హర్యానా ప్రజలు ఈ ర్యాలీ నిర్వహించినట్టు అందులో తెలిపారు. ఈ ర్యాలీ ఎక్కడ జరిగిందో స్పష్టంగా తెలియనప్పటికీ, పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది అని, రైతులు ఇటివల నిర్వహించిన ట్రాక్టర్ పెరేడ్ కి సంబంధించింది కాదని ఈ వివరాల ఆధారంగా ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, 2019లో CAA, NRC చట్టాలకి మద్దతు పలుకుతూ చేసిన ర్యాలీ యొక్క వీడియోని రైతులు ఇటివల నిర్వహించిన ట్రాక్టర్ పెరేడ్ కి ముడిపెడుతున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll