అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌ని తాజగా తాలిబన్లు ఆక్రమించడంతో, ఆ దేశ పరిపాలన వారి చేతుల్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, తాజగా కొంత మంది ఒక వీడియోని సోషల్ మీడియాలో పెట్టి, ‘అఫ్గానిస్థాన్‌లో బూర్కా ముఖానికి దరించలేదని ముస్లిం సోదరిని నడిరోడ్డుపై కాల్చిపాడేసిన తాలిబాన్’, అని షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: అఫ్గానిస్థాన్‌లో బూర్కా ముఖానికి దరించలేదని ముస్లిం మహిళని నడిరోడ్డుపై కాల్చిపాడేసిన తాలిబన్ల వీడియో.
ఫాక్ట్: పోస్ట్‌లోని వీడియో కనీసం ఆరేళ్ల పాతది. అంతేకాదు, ఆ వీడియోని తీసింది సిరియాలో; అఫ్గానిస్థాన్‌లో కాదు. వీడియోలో మహిళని కాలుస్తున్నది సిరియాలోని ‘అల్ నుస్రా ఫ్రంట్’ తీవ్రవాద గ్రూప్‌కి చెందిన వారు. కావున, పోస్ట్‌లో చెప్పింది తప్పు.
పోస్ట్‌లోని వీడియో యొక్క స్క్రీన్‌షాట్స్‌ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా, ఆ వీడియోకి సంబంధించిన చాలా న్యూస్ ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్‌లో వచ్చాయి. ఆ వీడియోలో గోడ మీద ‘అల్ నుస్రా ఫ్రంట్’ గ్రూప్ గురించి రాసి ఉందని, ఆ గ్రూప్ సిరియాకి చెందింది కాబట్టి ఆ వీడియో సిరియాలో తీసినట్టు చెప్తూ, ‘డైలీ మెయిల్’ వారు 2015లో పోస్ట్ చేసిన అర్టికల్‌ని ఇక్కడ చదవొచ్చు.
‘అల్ నుస్రా ఫ్రంట్’ గ్రూప్ తీవ్రవాదులు ‘అల్ ఖైదా’కి చెందినట్టు వివిధ ఆర్టికల్స్‌లో చదవొచ్చు. అంతేకాదు, ‘అల్ ఖైదా’ వారికి ‘తాలిబాన్’ తో సంబంధాలు ఉన్నట్టు తెలిసింది. వీడియోలోని ఘటనకి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.
చివరగా, పోస్ట్‌లోని వీడియో చాలా పాతది. వీడియోని తీసింది సిరియాలో; అఫ్గానిస్థాన్‌లో కాదు. సంబంధంలేని పాత వీడియోని అఫ్గానిస్థాన్‌లో తాజా పరిస్థితులకు ముడిపెడుతూ తప్పుగా షేర్ చేస్తున్నారు.