Fake News, Telugu
 

టెర్రరిస్టులు వచ్చి ఎయిడ్స్ ఇంజెక్షన్లను వేస్తూన్నారంటూ విజయవాడ పోలీసులు ఎటువంటి హెచ్చరిక జారీ చేయలేదు

0

‘ఎవరైనా మీ ఇంటి దగ్గరికి వచ్చి, మేము ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వచ్చాము. ఇన్సులిన్, విటమిన్ ఇంజక్షన్స్ ఉచతంగా వేస్తాం అని చెప్తే, తొందరపడి వేయించుకోవద్దు. టెర్రరిస్టులు ఈ విధంగా వచ్చి ఎయిడ్స్ ఇంజెక్షన్లను చేేస్తూన్నారంట  జాగ్రత్త’ అని విజయవాడ సిటీ పోలీసులు ఒక హెచ్చరిక జారీ చేసినట్లుగా సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతోంది. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: టెర్రరిస్టులు మెడికల్ విద్యార్థుల వేషం లో వచ్చి ఎయిడ్స్ ఇంజెక్షన్లును వేస్తూన్నారంటూ హెచ్చరికలు జారీ చేసిన విజయవాడ పోలీసులు.

ఫాక్ట్ (నిజం): ): విజయవాడ పోలీసులు అటువంటి హెచ్చరిక తాము జారీ చేయలేదని గతం లోనే స్పష్టం చేశారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్టు లో చెప్పిన విషయం గురించి సమాచారం వెతికినప్పుడు, ఆ మెసేజ్ కనీసం 2018 నుండి సోషల్ మీడియా లో చలామణీ అవుతోందని తెలిసింది. విజయవాడ పోలీసులు ఆ మెసేజ్ జులై 2019 లో కూడా షేర్ అవడం తో అప్పుడు స్పష్టత ఇచ్చారు. విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు ఆ హెచ్చరిక తాము జారీ చేయలేదని అది ‘ఫేక్’ న్యూస్ అని తెలిపారు

గతం లో అదే మెసేజ్ ఉత్తర్ ప్రదేశ్ పోలీసుల పేరు మీద చలామణీ అవడంతో FACTLY, ఆ మెసేజ్ ని సరి చూసి ఫాక్ట్ చెక్ ఆర్టికల్ ని రాసింది. మెసేజ్ మళ్ళీ విజయవాడ పోలీసుల పేరు మీద షేర్ అవుతుండడంతో FACTLY వారిని సంప్రదించింది. విజయవాడ పోలీసుల నుండి సమాధానం రాగానే ఆర్టికల్ అప్డేట్ చేయబడుతుంది.

చివరగా, ‘టెర్రరిస్ట్ గ్రూప్ లు మెడికల్ విద్యార్థుల వేషం లో వచ్చి ఇంజెక్షన్లు ఇస్తామని సిటీ లో తిరుగుతున్నారు జాగ్రత్త’ అంటూ విజయవాడ పోలీసులు ఎటువంటి హెచ్చరిక జారీ చేయలేదు. 

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll