Fake News, Telugu
 

పాత వీడియోని ఇప్పుడు హైదరాబాద్ లో కురిసిన వర్షాలకి నిండిపోయిన ఉస్మాన్ గంజ్ అంటూ షేర్ చేస్తున్నారు

0

హైదరాబాద్ నగరంలో ‘13 అక్టోబర్ 2020’ నాడు కురిసిన భారీ వర్షానికి, నగరంలోని చాలా ప్రదేశాలు వరదలతో నిండిపోయాయి. ఈ నేపధ్యంలో, నగరంలో పరిస్థితులకు సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని నిజమే అయినప్పటికీ, కొన్ని  హైదరాబాద్ కు సంబంధంలేని పాత వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చారిత్రక హైదరాబాద్ నగరం ఉస్మాన్ గంజ్ లో ప్రస్తుత పరిస్థితి, అంటూ షేర్ చేస్తున్న ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వరద నీటిలో జనాలు కొట్టుకుపోతున్న దృశ్యాలు ఈ వీడియోలో మనం చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: హైదరాబాద్ లో ‘13 అక్టోబర్ 2020’ నాడు కురిసిన భారీ వర్షానికి ఉస్మాన్ గంజ్ దగ్గర జనాలు వరద నీటిలో కొట్టుకుపోతున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది. ఈ వీడియో సెప్టెంబర్ 2019 నుంచే ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంది. ఈ వీడియోకి హైదరాబాద్ లో ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలకి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న ఈ క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, అవే దృశ్యాలు కలిగి ఉన్న వీడియోని చాలా మంది 2019లో ఇదే క్లెయిమ్ చేస్తూ పోస్ట్ చేసినట్టు తెలిసింది. 2019లో పోస్ట్ చేసిన ఆ వీడియోలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ‘News-18 Telugu’ ఛానల్ వారు కూడా ఈ వీడియోని హైదరాబాద్ నగరానికి సంబంధించిందని 2019లో రిపోర్ట్ చేసిన వీడియోలో తెలిపారు. అయితే, ఈ వీడియో ఏ ప్రదేశానికి సంబంధించిందని ఖచ్చితమైన సమాచారం FACTLY తెలుసుకోలేకపోయింది.

హైదరాబాద్ నగరంలో ‘13 అక్టోబర్ 2020’ నాడు కురిసిన భారీ వర్షం దాటికి నగరంలో పలు చోట్ల వరదల వీడియోలు ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరగా, పాత వీడియోని చూపిస్తూ ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కురిసిన వర్షాలకి వరదలతో నిండిపోయిన ఉస్మాన్ గంజ్ అంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll