Fake News, Telugu
 

చంద్రబాబు నాయుడు కోసం రాజమండ్రికి వెళ్తున్న Z+ కాన్వాయ్ అంటూ ఒక పాత వీడియోను షేర్ చేస్తున్నారు

0

చంద్రబాబు నాయుడు కోసం రాజమండ్రికి వెళ్తున్న Z+ కాన్వాయ్ అంటూ ఒక వీడియోను షేర్ చేసిన పోస్ట్ ఒకటి  సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: చంద్రబాబు నాయుడు కోసం రాజమండ్రికి వెళ్తున్న Z+ కాన్వాయ్ దృశ్యాలు.

ఫాక్ట్(నిజం):  ఈ వీడియో నవంబర్ 2021లో కడపలో వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు పర్యటించినప్పటిది. 2021 నుండి ఈ వీడియో సోషల్ మీడియాలో అందుబాటులో ఉంది. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో బెయిల్ మంజూరు కాకముందు నుండి ఈ వీడియో ఇంటర్నెట్లో అందుబాటులో ఉంది.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి 31 అక్టోబర్ 2023న మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలోనే ఆయనను తీసుకరావడానికి Z+ కాన్వాయ్ రాజమండ్రికి వెళ్తుందని ఈ వీడియో వైరల్ అవుతుంది.

ఐతే ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియో ఈ రోజు జరిగిన పరిణామాలకు ఎటువంటి సంబంధం లేదు. ఈ వీడియో పాతది. 2021 నుండి ఈ వీడియో సోషల్ మీడియాలో అందుబాటులో ఉంది (ఇక్కడ & ఇక్కడ). కడప, చిత్తూరు జిల్లా వరద బాధితులను పరామర్శించడానికి బయలుదేరిన చంద్రబాబు నాయుడు గారు అంటూ ఈ వీడియోను షేర్ చేసారు.

నవంబర్ 2021లో కడపలో వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు పర్యటించినట్టు వార్తా కథనాలు కూడా ఉన్నాయి (ఇక్కడ & ఇక్కడ). కాబట్టి ఈ వీడియో ఆ సందర్భానికి సంబంధించిందే అయ్యుండే అవకాశం ఉంది. కాగా వార్తా కథనాల ప్రకారం చంద్రబాబు నాయుడు 31 అక్టోబర్ 2023 సాయంకాలం వరకు బైటికి వచ్చే అవకాశం ఉంది.

చివరగా, చంద్రబాబు నాయుడు కోసం రాజమండ్రికి వెళ్తున్న Z+ కాన్వాయ్ అంటూ ఒక పాత వీడియోను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll