Fake News, Telugu
 

ఆస్ట్రేలియా అభిమాని వందేమాతరం నినాదాలు చేస్తున్న పాత వీడియోని ప్రస్తుత T20 వరల్డ్ కప్‌కి ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

0

ఇటీవల జరిగిన T20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఆస్ట్రేలియా గెలిచిన అనంతరం ఆస్ట్రేలియా క్రికెటర్ వందేమాతరం నినాదాలు చేసాడని చెప్తూ ఒక వీడియో విస్తృతంగా షేర్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించిన నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: పాకిస్తాన్‌ vs ఆస్ట్రేలియా T20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌ అనంతరం ఆస్ట్రేలియా క్రికెటర్ ఒకరు వందేమాతరం నినాదాలు చేసిన వీడియో.

ఫాక్ట్ (నిజం): జనవరి 2021లో గబ్బాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించిన అనంతరం స్టాండ్స్‌లోని ఆస్ట్రేలియా అభిమాని ఒకరు ఇలా ‘భారత్ మాతాకీ జై’, ‘వందేమాతరం’ అంటూ నినాదాలు చేసాడు. ఈ నినాదాలు చేసింది ఆస్ట్రేలియన్ క్రికెటర్ కాదు. ఈ వీడియోకి ఇటీవల పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన T20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్‌కి ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వీడియోలో ‘వందేమాతరం’, ‘భారత్ మాతాకి జై’ అని నినాదాలు చేస్తున్నది  ఆస్ట్రేలియన్ క్రికెటర్ కాదు, పాత ఆస్ట్రేలియన్ జెర్సీ ధరించిన ఒక అభిమాని. ఈ సంవత్సరం జనవరిలో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆస్ట్రేలియాలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఈ ఘటన జరిగింది.

ఈ వీడియోకి సంబంధించిన సమాచారం కోసం గూగుల్‌లో కీవర్డ్ సెర్చ్ చేయగా ఈ వీడియోని రిపోర్ట్ చేసిన అనేక వార్తా కథనాలు మాకు కనిపించాయి. ఈ కథనాల ప్రకారం  జనవరి 2021లో గబ్బాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించిన అనంతరం స్టాండ్స్‌లోని ఆస్ట్రేలియా అభిమాని ఒకరు ‘భారత్ మాతాకీ జై’, ‘వందేమాతరం’ నినాదాలు చేసాడు. అప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యింది.

పైగా ఆ సమయంలో చాలా మీడియా సంస్థలు కూడా ఈ వీడియోని రిపోర్ట్ చేసాయి, కొన్ని రిపోర్ట్స్ ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఐతే ప్రస్తుతం జరుగుతున్న T20 వరల్డ్ కప్‌లో భారత్ పాకిస్తాన్ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే, ఐతే ఇటీవల జరిగిన వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ ఓడిపోవడంతో  ఈ వీడియోని తిరిగి షేర్ చేస్తున్నారు.

చివరగా, ఆస్ట్రేలియా అభిమాని వందేమాతరం నినాదాలు చేస్తున్న పాత వీడియోని ప్రస్తుత T20 వరల్డ్ కప్‌కి ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll