Fake News, Telugu
 

చంద్రయాన్-3 విజయవంతమైన ల్యాండింగ్ తరువాత బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీని అభినందిస్తున్నారంటూ పాత వీడియోను షేర్ చేస్తున్నారు

0

బ్రిక్స్ సదస్సుకు హాజరైన వివిధ దేశాల అగ్ర నేతలు మరియు సభ్యులు ప్రధాని మోదీని చంద్రయాన్-3 విజయవంతమైన ల్యాండింగ్ తరువాత అభినందిస్తున్నారు అంటూ ఒక పోస్టు సోషల్ మీడియాలో షేర్ చెయ్యబడుతోంది. ఆ క్లెయిమ్ నిజమో కాదో చూద్దాం.

క్లెయిమ్: చంద్రయాన్-3 విజయవంతమైన ల్యాండింగ్ తరువాత, బ్రిక్స్ సదస్సులో  ప్రధాని నరేంద్ర మోదీకి వివిధ దేశాల అగ్ర నేతలు అభినందనలు తెలుపుతున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): పలువురు నేతలు ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలుపుతున్న ఈ వీడియో 23 జూన్ 2023న అమెరికాలో జరిగిన US కాంగ్రెస్ జాయింట్ సెషన్ లోనిది. ఈ వీడియోకి బ్రిక్స్ సదస్సుకి కానీ, చంద్రయాన్-3 ల్యాండింగ్ కి కానీ ఎటువంటి సంబంధం లేదు. కావున, ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

ముందుగా, ఈ పోస్టులో ఉన్న దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతకగా, ఈ వీడియో మోదీ హాజరు అయిన,  అమెరికాలో జరిగిన US కాంగ్రెస్ జాయింట్ సెషన్ కు సంబంధించినది అని తెలిసింది.

బ్రిక్స్ సదస్సు, US జాయింట్ కాంగ్రెస్ మరియు చంద్రయాన్ 3 గురించి ఇంటర్నెట్లో వెతికితే, US జాయింట్ కాంగ్రెస్ 22 జూన్ 2023న జరగగా, చంద్రయాన్-3 ల్యాండింగ్ 23 ఆగష్టు 2023న సక్సెస్ అయింది మరియు బ్రిక్స్ సమ్మిట్ 22 ఆగష్టు 2023 నుండి 24 ఆగష్టు 2023న జరిగింది అని స్పష్టమయింది.

అయితే, చంద్రయాన్ 3 లాండింగ్ మరియు బ్రిక్స్ సదస్సు ఒకే సమయంలో జరిగాయి. ఆ సమావేశంలో భారత దేశాన్ని దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడు, వివిధ దేశాల ప్రతినిధులు అభినందించడం జరిగింది. కానీ షేర్ అవుతున్న వీడియో బ్రిక్స్ సదస్సు నాటిది కాదు అని ఈ  వీడియో ద్వారా తెలుస్తుంది.

చివరిగా, రెండు నెలల క్రితం జరిగిన US జాయింట్ కాంగ్రెస్ మీటింగ్ లోని ప్రధాని మోదీ వీడియోను, ఇటీవల జరిగిన బ్రిక్స్ సదస్సులో, చంద్రయాన్-3 విజయవంతమైన ల్యాండింగ్ తరువాత ప్రధాని మోదీని అభినందిస్తున్నారంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll