Fake News, Telugu
 

పాత, సంబంధంలేని వీడియోలను అక్టోబర్ 2023 ఇజ్రాయిల్- పాలస్తీనా సంఘర్షణకు ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు

0

07 అక్టోబర్ 2023న పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ సంస్థ ఇజ్రాయిల్‌పై చేసిన మెరుపుదాడి వలన తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. దీని తర్వాత ఇజ్రాయిల్‌ పాలస్తీనాపై (గాజా ప్రాంతంలో) యుద్ధం ప్రకటించి దాడులు చేయడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో, ఈ యుద్ధానికి సంబంధించిన దృశ్యాలంటూ కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉన్నాయి. వీటిలో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

వీడియో 1:

హమాస్ ఉగ్రవాదులు పారాచూట్లు వేసుకొని ఇజ్రాయిల్‌లో దిగుతున్న దృశ్యాలని చెప్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

ముందుగా ఈ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోని 29 సెప్టెంబర్ 2023 లోనే యూట్యూబ్‌లో అప్‌లోడు చేసినట్లు గుర్తించాం. అయితే ఈ వీడియో ఈజిప్ట్‌లోని కైరో నగరం సమీపంలో ఉన్న హీలియోపోలిస్ ప్రాంతంలో తీసినదిగా పేర్కొన్నారు. అంతే కాదు, వీడియోలో ఉన్న వ్యక్తుల టీ-షర్ట్ పైన ‘EL NASR SC’ అని రాశి ఉండడం గుర్తించాం. దీన్ని ఆధారంగా వెతికితే, ఈ వీడియో కైరో నగరం సమీపంలో ఉన్న ఎల్-నసర్ స్పోర్టింగ్ క్లబ్బులో తీసినట్లుగా స్పష్టమైంది. ఈ క్లబ్బులో తీసిన మరిన్ని వీడియోలు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

Share.

About Author

Comments are closed.

scroll