ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమ బెంగాల్ లో నిర్వహించిన పరివర్తన్ ర్యాలికి భారీగా హాజరైన జన సంద్రం, అంటూ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ అవుతున్నాయి. పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో, బీజేపీ 07 మర్చి 2021 నాడు కోల్‌కతా లో నిర్వహించిన ర్యాలీలో నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: పశ్చిమ బెంగాల్ లో నరేంద్ర మోదీ ఇటీవల నిర్వహించిన ఎన్నికల సభ యొక్క ఫోటోలు.
ఫాక్ట్ (నిజం): ఈ ఫోటోలు ఇటీవల బీజేపీ కోల్‌కతా నగరంలో నిర్వహించిన బహిరంగ సభకు సంబంధించినవి కావు. వీటిలో ఒక ఫోటో లెఫ్ట్-కాంగ్రెస్ పార్టీలు ఇటీవల కోల్‌కతా లో కలిసి నిర్వహించిన బహిరంగ సభకు సంబంధించినది. మిగితా రెండు ఫోటోలలో ఒక ఫోటో 2014లో జరిగిన బహిరంగ సభకు సంబంధించినదైతే, మరొకటి 2019లో కోల్‌కతా లో నిర్వహించిన మరొక బహిరంగ సభకు సంబంధించింది. కావున, ఈ పోస్టులలో చేస్తున్న క్లెయిమ్లు తప్పు.
ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే బహిరంగ సభ ఫోటోని 2014లో ఒక వెబ్ సైట్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ‘Picture of Rally in Brigade Parade Ground, at Kolkata’అనే టైటిల్ తో ఈ ఫోటోని ఆ వెబ్ సైట్ పబ్లిష్ చేసింది. ఈ వివరాల ఆధారంగా ఆ ఫోటోకి సంబంధించిన పూర్తి వివరాల కోసం వెతికితే, ఇదే ఫోటో ‘Prokerala’ వెబ్సైటులో దొరికింది. “People gather at the Brigade Parade Ground during a Left Front rally in Kolkata on Feb.9, 2014. (Photo: Kuntal Chakrabarty/IANS)” అని ఫోటో వివరణలో తెలిపారు. దీన్ని బట్టి, ఈ ఫోటో 2014లో లెఫ్ట్ పార్టీలు కోల్‌కతా లో నిర్వహించిన బహిరంగ సభకు సంబంధించిందని చెప్పవచ్చు.
ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని షేర్ చేస్తూ 2019లో పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. లెఫ్ట్ ఫ్రంట్ పార్టీలు కోల్‌కతా నగరంలోని బ్రిగేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన బహిరంగ సభకు సంబంధించిన ఫోటో ఇదని ఆర్టికల్ లో తెలిపారు. పశ్చిమ బెంగాల్ CPI (M) పార్టీ, ఈ ఫోటోని ‘A bird eye view of last year Brigade Rally at #Kolkata’ అని వివరిస్తూ 2020లో ట్వీట్ పెట్టారు.
ఈ ఫోటోని ఇదే వివరణతో ‘Alamy’ వెబ్సైటులో పబ్లిష్ చేసారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటో నరేంద్ర మోదీ ఇటీవల కోల్‌కతా నగరంలో నిర్వహించిన ఎన్నికల సభకు సంబంధించింది కాదని ఖచ్చితంగా చెప్పవచ్చు.
ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే బహిరంగ సభ ఫోటోని షేర్ చేస్తూ ‘The Telegraph’ మరియు ‘India Today’ ఆర్టికల్స్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఈ ఫోటో వివరణలో ‘Hundreds of supporters join Left-Congress and Indian Secular Front (ISF) mega rally at Brigade Parade Ground in Kolkata ahead of the West Bengal Election 2021.’ అని తెలిపారు. దీన్ని బట్టి, ఈ ఫోటో ఇటీవల లెఫ్ట్-కాంగ్రెస్ పార్టీలు కోల్‌కతాలో నిర్వహించిన బహిరంగ సభకు సంబంధించిందని చెప్పవచ్చు.
ఈ క్లెయిమ్ కి సంబంధించి షేర్ చేసిన మొదటి ఫోటో మరియు రెండో ఫోటోలని లెఫ్ట్ పార్టీలు , కాంగ్రెస్ పార్టీ ఇటీవల నిర్వహించిన బహిరంగ సభ ఫోటోలని తప్పుగా షేర్ చేసారు. రెండో ఫోటోని ఇదివరకు తప్పు క్లెయిమ్ తో షేర్ చేసినప్పుడు, దానికి సంబంధించి FACTLY ఫాక్ట్-చెక్ ఆర్టికల్ పబ్లిష్ చేసింది.
నరేంద్ర మోదీ ఇటీవల కోల్‌కతా లో నిర్వహించిన ఎన్నికల సభ యొక్క ఫోటోలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
చివరగా, సంబంధం లేని పాత ఫోటోలని చూపిస్తూ నరేంద్ర మోదీ ఇటీవల కోల్‌కతా లో నిర్వహించిన ఎన్నికల సభ ఫోటోలని షేర్ చేస్తున్నారు.