మోదీ మామల్లాపురం బీచ్ లో చెత్త ఏరడానికి జరిగిన తంతుకి సంబంధించిన ఫోటోలంటూ ఒక నాలుగు ఫొటోలతో కూడిన పోస్ట్ సోషల్ మీడియా లో ప్రచారం కాబడుతోంది. ఆ పోస్టులో ఎంత వరకు నిజం ఉందో కనుక్కుందాం.

క్లెయిమ్: మోదీ చెత్త ఏరడానికి జరిగిన ఏర్పాట్లు అని చూపిస్తున్న ఫోటోలు
ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో షేర్ చేసిన ఫోటోల్లో ఒక ఫోటో ఏప్రిల్ 2019లో మోదీ రాక సందర్భం లో కోజికోడ్ బీచ్ లో సెక్యూరిటీ తనిఖీ నిర్వహిస్తున్న బాంబు స్క్వాడ్ ది. ఇంకొక ఫోటో, ‘Tayscreen’ వెబ్సైటు నుంచి తీసుకోబడిన పాత ఫోటో. కావున, పోస్ట్ లోని క్లెయిమ్ అబద్ధం.
ఫోటో-1:

ఇదే ఫోటో తో కూడిన వేరే పోస్ట్ కింద ఒక వ్యక్తి పెట్టిన కామెంట్ లో ఈ ఫోటో ‘Tayscreen’ వెబ్సైటు కి సంబంధించింది అని తెలిసింది. ఈ ఫోటో గురించి ‘Tayscreen’ వెబ్సైటులో వెతికితే ఇలాంటి ఫోటోనే కనిపించింది. అంతేకాక, ఆ వెబ్సైటు లోని వివరాల ప్రకారం ఆ ఫోటో 2012 లోనే తీశారు అని తెలుస్తుంది.
ఫోటో-2:

ఈ ఫోటో ‘The Hindu‘ వార్తా పత్రిక లో ఏప్రిల్ 11, 2019 లో ప్రచురించబడింది. ఆ ఫోటో కింద ఇచ్చిన సమాచారం ప్రకారం అది ఒక పబ్లిక్ ఈవెంట్ కోసం మోడీ రాక సందర్భంలో బాంబు స్క్వాడ్ సిబ్బంది కోజికోడ్ బీచ్ లో చేసిన సెక్యూరిటీ తనిఖీ గా తెలుస్తుంది.
ఫోటో-3:
కొంతమంది వ్యక్తులు బీచ్ లో చెత్త ఏరుతున్న ఈ ఫోటోని ఇంటర్నెట్ లో వెతకగా ఎటువంటి వివరాలు దొరకలేదు. కావున, ఆ నాలుగు ఫొటోల్లో ఒక్క మోదీ ఉన్న ఫోటో మినహాయించి, మిగితా మూడు ఫొటోల్లో, రెండు ఫోటోలకి అసలు ఆ కార్యక్రమంతో సంబంధమే లేదు.
చివరగా, అసలు ఏ సంబంధం లేని కొన్ని ఫోటోలను మోదీ మామల్లాపురం బీచ్ లో చెత్త ఏరడానికి జరిగిన ఏర్పాట్లు అన్నట్టు గా ప్రచారం చేస్తున్నారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: పోస్ట్ లో ఫోటోలు మోదీ మామల్లాపురం బీచ్ లో చెత్త ఏరినప్పుడు ఏర్పాట్ల ఫోటోలు కావు - Fact Checking Tools | Factbase.us