Fake News, Telugu
 

‘యశోద ఆసుపత్రిలో కేసీఆర్ కు చికిత్స’ పేరుతో వైరల్ అవుతున్న ఫోటోలు జనవరి 2020 వీడియో కి సంబంధించినవి, ఇప్పటివి కావు

0

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థత తో సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో చేరినట్టు చెప్తున్న ‘హెచ్ఎంటీవీ’ వారి బ్రేకింగ్ న్యూస్ వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని తాజాగా చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: బ్రేకింగ్ న్యూస్: స్వల్ప అస్వస్థత తో సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో చేరిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని ఫోటోల్లో ఉన్న బ్రేకింగ్ న్యూస్ పాతది. ఆ వీడియోని ‘హెచ్ఎంటీవీ’ వారు జనవరి 2020 లో పోస్ట్ చేసారు. తాజాగా కేసీఆర్ ఆసుపత్రిలో చేరినట్టు ఎక్కడా కూడా సమాచారం లేదు. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

పోస్ట్ లోని ఫోటోల్లో ఉన్న పదాలతో ఇంటర్నెట్ లో వెతకగా, చాలా వీడియోలు సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. ‘హెచ్ఎంటీవీ’ వారు యూట్యూబ్ లో పోస్ట్ చేసిన వీడియో కూడా సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ వీడియోలో పోస్ట్ లోని స్క్రీన్ షాట్స్ ని చూడవొచ్చు. అయితే, ఆ వీడియోని ‘హెచ్ఎంటీవీ’ వారు జనవరి 2020 లో పోస్ట్ చేసారు. అది తాజా బ్రేకింగ్ న్యూస్ కాదు. ఆ సమయంలో వేరే ఛానళ్ళు కేసీఆర్ అస్వస్థత  పై ప్రచురించిన వార్తలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.

తాజాగా కేసీఆర్ ఆసుపత్రిలో చేరినట్టు ఎక్కడా కూడా సమాచారం లేదు. అయితే, ఈ మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్ ఎక్కడా కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో ‘#Where is KCR’ ట్రెండ్ అవుతున్నట్టు ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు.  

చివరగా, జనవరి 2020 లో వచ్చిన బ్రేకింగ్ న్యూస్ వీడియో స్క్రీన్ షాట్స్ పెట్టి, ‘అస్వస్థత తో ఆసుపత్రిలో చేరిన ముఖ్యమంత్రి కేసీఆర్’ అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll