Fake News, Telugu
 

2019 ర్యాలీ ఫోటోని ఇటీవల కాంగ్రెస్-లెఫ్ట్ పార్టీలు కోల్‌కతాలో నిర్వహించిన ఎన్నికల సభ ఫోటోలుగా షేర్ చేస్తున్నారు

0

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కాంగ్రెస్- లెఫ్ట్ పార్టీలు ఉమ్మడిగా నిర్వహించిన ఎన్నికల సభకు భారీగా హాజరైన జనం, అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది. జన సముహంతో నిండి ఉన్న ఒక బహిరంగ సభ ఫోటోలని ఈ పోస్టులో షేర్ చేసారు. ఈ ఫోటోలని కాంగ్రెస్ పార్టీ కూడా తమ ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసింది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలు కలిసి ఇటీవల నిర్వహించిన ఎన్నికల సభ యొక్క ఫోటోలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్  చేసిన ఈ ఫోటో, 2019లో లెఫ్ట్ ఫ్రంట్ పార్టీలు కోల్‌కతాలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన బహిరంగ సభకు సంబంధించినవి. లెఫ్ట్ పార్టీలు ఇటీవల కాంగ్రెస్ తో కలిసి కోల్‌కతాలో బహిరంగ సభ నిర్వహించిన మాట నిజమే కానీ, ఈ ఫోటోలు ఆ బహిరంగ సభకు సంబంధించినవి కావు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టిస్తుంది.  

పోస్టులు షేర్ చేసిన ఈ రెండు ఫోటోలు ఒకే చిత్రాన్ని చూపిస్తున్నాయి. ఈ ఫోటోల రంగులలో మాత్రమే తేడాలున్నాయి. ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే,  ఇదే ఫోటోని షేర్ చేస్తూ 2019లో పబ్లిష్ అయిన ఒక న్యూస్ ఆర్టికల్ దొరికింది. 2019లో లెఫ్ట్ ఫ్రంట్ పార్టిలు కోల్‌కతాలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన బహిరంగ సభకు సంబంధించిన ఫోటో అని ఈ ఆర్టికల్ లో తెలిపారు.

ఈ వివరాల ఆధారంగా ఆ సభకు సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, పోస్టులోని అదే ఫోటోని CPI(M) పశ్చిమ బెంగాల్ పార్టీ 10 జూన్ 2020 నాడు తమ ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేసినట్టు తెలిసింది. ‘A bird eye view of last year Birgade Rally at Kolkata’ అని తెలుపుతూ CPI(M) పార్టీ ఈ ఫోటోని షేర్ చేసారు. దీనిబట్టి, ఈ ఫోటో 2019లో జరిగిన బహిరంగ సభకు సంబంధించిందని చెప్పవచ్చు.

2019లో లెఫ్ట్ ఫ్రంట్ పార్టీలు నిర్వహించిన ఈ సభ యొక్క వివరాలను తెలుపుతూ చాలా వార్తా సంస్థలు ఆర్టికల్స్ పబ్లిష్ చేసాయి. ఆ ఆర్టికల్స్ ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఫోటోలు, 2019లో లెఫ్ట్ పార్టీలు కోల్‌కతాలో నిర్వహించిన బహిరంగ సభకు సంబంధించింది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.

కోల్‌కతాలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్ లో లెఫ్ట్ పార్టీలు ఇటీవల కాంగ్రెస్ పార్టీతో కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించాయి. కాని, పోస్టులో షేర్ చేసిన ఫొటోలు ఈ బహిరంగ సభకు సంబంధించింది కాదు.

చివరగా, 2019లో లెఫ్ట్ ఫ్రంట్ పార్టీలు నిర్వహించిన బహిరంగ సభ ఫోటోని, ఇటీవల కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీలతో తో కలిసి కోల్‌కతా లో నిర్వహించిన బహిరంగ సభ ఫోటోలుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll