Coronavirus Telugu, Fake News, Telugu
 

పాత డేటాను చూపించి తెలుగు రాష్ట్రాలు వాక్సిన్ వృధా చేయటంలో తోలి రెండు స్థానాల్లో ఉన్నట్టు ఇప్పుడు షేర్ చేస్తున్నారు

0

కోవిడ్ వాక్సిన్ వృధా చేయటంలో తెలుగు రాష్ట్రాలు భారత దేశంలోనే తోలి రెండు స్థానాల్లో ఉన్నట్టు ఒక సోషల్ మీడియా పోస్ట్ షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులొ ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడొచ్చు.

క్లెయిమ్: వాక్సిన్ వృధా చేయటంలో తెలుగు రాష్ట్రాలు భారత దేశంలోనే తోలి రెండు స్థానాల్లో ఉన్నాయి.

ఫాక్ట్: వాక్సిన్ వృధాకి సంబంధించి పోస్టులో షేర్ చేసిన డేటా మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన డేటా. తాజాగా ఏప్రిల్ నెలలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు విడుదల చేసిన డేటాలో తెలుగు రాష్ట్రాలు మొదటి పది స్థానాల్లో కూడా లేవు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

గూగుల్ లో ‘vaccine wastage’ అని సెర్చ్ చేసినప్పుడు, ‘ఇండియన్ ఎక్స్ప్రెస్‘ ఆర్టికల్ దొరికింది. అందులొ భారత దేశంలో చేసే వాక్సిన్ వృధా కు సంబంధించి వివరించారు. ఈ ఆర్టికల్ 27 మార్చి 2021 న ప్రచురించబడింది. పోస్టులో వాడిన చార్ట్ ఈ ఆర్టికల్ లో చూడొచ్చు.

ఇదే విషయానికి సంబంధించి 17 మార్చి 2021 లో PIB తన ప్రెస్ రిలీజ్ లో వాక్సిన్ ల యొక్క వృధా గురించి వివరించింది.

కానీ, ఇది మార్చి నెల వరకు సంబంధించిన వివరాలు, అప్పటికి వాక్సిన్ వృధాకు సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులో లేవని, సెంటర్ మరియు స్టేట్ మధ్య కొంత ‘misinformation’ మూలాన లెక్కలు వేరుగా ఉన్నాయని తెలంగాణ మరియు ఇతర రాష్ట్రాలు వాదించాయి. దీనికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్ ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. 

తాజాగా 28 ఏప్రిల్ 2021 న కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారు వాక్సిన్ ల వృధా కు సంబంధించి విడుదల చేసిన డేటా ప్రకారం తొలి పది స్థానాల్లో కూడా తెలుగు రాష్ట్రాలు లేవు. కావున, తెలుగు రాష్ట్రాలు దేశంలో తోలి రెండు స్థానాల్లో ఉన్నాయి అనటం తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

వాక్సిన్ వృధా కు సంబంధించి అన్ని రాష్ట్రాల యొక్క పూర్తి వివరాలు కింది చార్ట్ లో చూడొచ్చు.

చివరగా, పాత డేటాను చూయించి తెలుగు రాష్ట్రాలు వాక్సిన్ వృధా చేయటంలో దేశంలో తోలి రెండు స్థానాల్లో ఉన్నట్టు ఇప్పుడు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll