ఫేస్బుక్ లో రెండు ఫోటోలు పోస్టు చేసి, అవి ప్రస్తుతం ఊటీ-కోయంబత్తూర్ రోడ్ల పై పరిస్థితి అని వాటి గురించి చెప్తున్నారు. ఒక ఫోటోలో జింకల సమూహం రోడ్డు మధ్యలో కుర్చుని ఉంటుంది, మరొక ఫోటోలో నెమలుల రోడ్డు పై తిరుగుతూ కనిపిస్తాయి. ఆ ఫోటోల గురించి చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: ప్రస్తుతం ఊటీ-కోయంబత్తూర్ రోడ్ల పై జింకలు మరియు నెమలులు ఉన్న ఫోటోలు.
ఫాక్ట్ (నిజం): రోడ్డు మధ్యలో జింకల సమూహం కూర్చుని ఉన్న ఫోటో ఇంటర్నెట్ లో కనీసం 2014 నుండి ఉంది మరియు దానిని జపాన్ లో తీసారు. రోడ్డు పై నెమలులు తిరుగుతున్న ఫోటో పాతది, దానిని ‘చట్ బిర్ జూ’ (చండీగఢ్) లో తీసారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
ఫోటో-1:
ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, అది ఒక ఫేస్బుక్ యూజర్ జూన్ 2019 లో పెట్టిన పోస్టు లో లభించింది. అలాంటి ఫోటో నే ట్విట్టర్ లో ‘Peacocks block a road in Chandigarh, India. Photo by Vama Dalal’ అనే వివరణతో లభించింది. ఆ ఫోటోగ్రాఫర్ ని ‘FACTLY’ సంప్రదించినప్పుడు, తాను ఆ ఫోటోని ‘చట్ బిర్ జూ’ (చండీగఢ్) లో తీసినట్లుగా తెలిపారు. అంతేకాదు, అలాంటి విజువల్స్ నే ‘చట్ బిర్ జూ’ లో సఫారీ కి సంబంధించిన యూట్యుబ్ వీడియో లో కుడా చూడవచ్చు.
ఫోటో-2:
గతంలో ఈ ఫోటో ఇదే ఆరోపణ తో చలామణీ అయినప్పుడు, ‘FACTLY’ ఆ ఫోటో కనీసం ఆరు సంవత్సరాల క్రితందని, దానిని జపాన్ లో తీసారని తేల్చింది.
పైన ఫోటోలతో ఉన్న ఆరోపణతోనే ‘ఇంగ్లీష్’ క్లెయిమ్ తో మరొక వీడియో (ఆర్కైవ్డ్) కుడా చలామణీ అవుతోంది. ఆ వీడియో లో అడవి పందులు రోడ్డు పై తిరుగుతూ కనిపిస్తాయి. ఆ వీడియో గురించి FACTLY కి స్పష్టమైన సమాచారమేమీ లభించలేదు. కానీ, అది ఇండియా లో లాక్ డౌన్ ని విధించడం కంటే ముందు నుండి ఇంటర్నెట్ లో ఉన్నట్లుగా తెలిసింది.
చివరగా, సంబంధంలేని పాత ఫోటోలు పెట్టి, ‘ప్రస్తుతం ఊటీ-కోయంబత్తూర్ రోడ్లు’ అని ప్రచారం చేస్తున్నారు.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?