అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా జ్ఞానం విషయంలో అంబేద్కర్ ముందు తల దించుకుంటానని చెప్పినట్టుగా ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్ (దావా): ఒబామా: “ప్రపంచ తలరాతలు మార్చగలిగే నేను జ్ఞానం విషయంలో ఎవరి ముందు అయిన తల దించాల్సి వస్తే అది ఒక డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ముందే..”
ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో ఉన్న వాఖ్యలను ఒబామా చేసినట్టుగా ఎక్కడా కూడా లేదు. 2010 లో పార్లమెంట్ లో ఇచ్చిన ప్రసంగంలో ఒబామా అంబేద్కర్ గురించి మాట్లాడాడు కానీ పోస్ట్ లో చెప్పిన వాఖ్యలు మాత్రం చేయలేదు. కావున పోస్ట్ లో చెప్పిన దాంట్లో నిజం లేదు.
పోస్ట్ లో చెప్పిన వాఖ్యాలను గూగుల్ లో వెతికితే, ఒబామా ఆ వాఖ్యలు చేసినట్టుగా ఎక్కడా కూడా దొరకదు. అలానే, ఒబామా ఎప్పుడైనా అంబేద్కర్ గురించి మాట్లాడారా అని వెతికితే, 2010 లో ఒబామా భారత పార్లమెంట్ లో స్పీచ్ ఇచ్చినప్పుడు అంబేద్కర్ గురించి మాట్లాడారని తెలుస్తుంది. కానీ పోస్ట్ లో ఉన్న వాఖ్యలు మాత్రం చేయలేదు. పార్లమెంట్ లో మాట్లాడుతూ “దళితుడు అయిన అంబేద్కర్ తన శక్తి సామర్థ్యాలను ఉపయోగించి భారత రాజ్యాంగాన్ని రాసారు, అది ఇప్పుడు భారతీయులందరి హక్కులు కాపాడుతుంది” అని అన్నారు.
చివరగా, పోస్ట్ లో చెప్పినట్టుగా ఒబామా అంబేద్కర్ ముందు తల దించుకుంటానని అనలేదు.