‘కొండపై నుండి కారు పడిపోయే ప్రమాదం…కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు’, అని చెప్తూ ఒక కారు యూ-టర్న్ వీడియోని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: కొండపై నుండి కారు పడిపోయే ప్రమాదం ఉన్నా, కొండ చివరి అంచున కారును యూ-టర్న్ చేస్తున్న వీడియో.
ఫాక్ట్: వీడియోలో చూపెట్టిన్న యూ-టర్న్‌కి సంబంధించిన వేరే వీడియోలు చూడగా, ఆ కారును యూ-టర్న్ చేసింది కొండ చివరి అంచున కాదని తెలుస్తుంది. మరో వైపు నుండి ఉన్న వీడియోలో ఆ రోడ్డు పక్కన కొంత దిగువున మరో రోడ్డు ఉన్నట్టు స్పష్టంగా కనపడుతుంది. కావున పోస్ట్‌లో కొండ అంచుల్లో యూ-టర్న్, కొండపై నుండి కారు పడిపోయే ప్రమాదం అని చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
పోస్ట్‌లోని వీడియో యొక్క స్క్రీన్‌షాట్స్‌ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా, ఆ వీడియోను చాలా మంది పోస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అందరికంటే ముందుగా ‘DrivingSkill’ అనే యూట్యూబ్ ఛానల్ వారు 25 డిసెంబర్ 2021న ఆ వీడియోను పోస్ట్ చేసినట్టుగా గమనించవచ్చు. అయితే, ఆ ఛానల్‌లో అంతకముందు రోజు పెట్టిన మరో వీడియో కూడా పోస్ట్‌లోని వీడియోలో ఉన్న యూ-టర్న్‌కి సంబంధించిందేనని చూడవచ్చు. ఆ మరో వీడియోని చూడగా, కారును యూ-టర్న్ చేసింది కొండ చివరి అంచున కాదని తెలుస్తుంది. మరో వైపు నుండి ఉన్న వీడియోలో ఆ రోడ్డు పక్కన కొంత దిగువున మరో రోడ్డు ఉన్నట్టు స్పష్టంగా కనపడుతుంది.
అంతేకాదు, ‘DrivingSkill’ యూట్యూబ్ ఛానల్‌లో అదే కారుతో చేసిన ఇతర వీడియోలను కూడా చూడవచ్చు. పోస్ట్‌లోని వీడియోలో ఉన్న యూ-టర్న్‌పై ‘డైలీ మెయిల్’ వార్తాసంస్థ రాసిన అర్టికల్‌ని ఇక్కడ చదవచ్చు.
చివరగా, వీడియోలోని కారు యూ-టర్న్ చేసింది కొండ చివరి అంచున కాదు. కారు యూ-టర్న్ చేస్తున్న రోడ్డు పక్కన కొంత దిగువున మరో రోడ్డు ఉంది.