Fake News, Telugu
 

శొంఠి పొడి ద్వారా కరోనాను నివారించవచ్చు అనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు

0

శొంఠి పొడి ద్వారా కరోనాని నివారించవచ్చని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రముఖ చాతి వైద్య నిపుణుడు డాక్టర్ జరీర్ ఉద్‌వాడియా పేరుతో ఈ వార్త షేర్ అవుతుంది. ఆల్కలీన్ స్వభావం కలిగిన అల్లంలో అధిక pH విలువ కలిగిన ఉండడం వల్ల శొంఠి పొడి ద్వారా ఇన్ఫెక్షన్లను కట్టడి చేయవచ్చని ఈ పోస్టులో పేర్కొన్నారు. ఈ కథనం ద్వారా పోస్టులో చెప్తున్న దాంట్లో నిజమెంతుందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: శొంఠి పొడి ద్వారా కరోనాని నివారించవచ్చు – డాక్టర్ జరీర్ ఉద్‌వాడియా.

ఫాక్ట్ (నిజం): శొంఠి పొడి ద్వారా కరోనాని లేదా ప్రత్యేకించి ఓమిక్రాన్ వేరియంట్‌ని కట్టడి నియంత్రించవచ్చు అనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. WHO నిపుణులు మరియు ఇతర సంస్థలు కూడా ఇదే చెప్తున్నాయి. ఇదే వార్త డాక్టర్ సుషీల్ రాజ్దన్ పేరుతో వైరల్ అయినప్పుడు, ఈ వార్త ఫేక్ అని అయన స్పష్టం చేసారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

శొంఠి పొడి ద్వారా కరోనాని లేదా ప్రత్యేకించి ఓమిక్రాన్ వేరియంట్‌ని కట్టడి నియంత్రించవచ్చు అనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పైగా అల్లం, నిమ్మకాయలు మొదలైనవాటితో కరోనాని నియంత్రించలేమని WHO నిపుణులు, ప్రముఖ సంస్థలు ఇప్పటికే స్పష్టం చేసాయి.

ముక్కు ద్వారాలలో వెల్లుల్లి రెబ్బలను ఉంచడం వల్ల ముక్కు మూసుకుపోవడం, సైనస్‌ల వంటి సమస్యలకు ఉపశమనం లభించదని పలు అధ్యయనాలు వెల్లడించాయి (ఇక్కడ & ఇక్కడ). పైగా ముక్కు ద్వారాల్లో అల్లం, లవంగాలు మొదలైనవి ఉపయోగించిన తర్వాత తలెత్తే సమస్యల గురించి వైద్యులు ఇప్పటికే  హెచ్చరించారు.

డాక్టర్ జరీర్ ఉద్‌వాడియా గురించి సమాచారం కోసం ఇంటర్నెట్‌లో వెతకగా, TB-RePORT International అనే వెబ్సైటులో గురించిన సమాచారం మాకు లభించింది. ఐతే ఈ వెబ్సైటులో ఉన్న జరీర్ ఉద్‌వాడియా ఫోటో ప్రకారం వైరల్ పోస్టులో ఉన్నది అసలైన జరీర్ ఉద్‌వాడియా కాదని స్పష్టమవుతుంది. ఇలా అయన పేరు వాడుకొని ఈ పోస్టును వైరల్ చేస్తున్నారు. అలాగే డాక్టర్ జరీర్ ఉద్‌వాడియా కరోనాపై చేసిన ప్రసంగాలలో ఎక్కడ కూడా శొంఠి పొడి ద్వారా కరోనాని నియంత్రించవచ్చని చెప్పలేదు.

ఇంతకు ముందు కూడా పోస్టులో ఫోటోలో ఉన్న వ్యక్తి ఇదే విషయాన్నీ చెప్తున్న వీడియో ప్రసిద్ధ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుశీల్ రజ్డాన్ పేరుతో వైరల్ అయ్యింది. ఐతే ఈ వార్త వైరల్ అవ్వడంతో,  డాక్టర్ సుశీల్ రజ్డాన్‌ని స్పందిస్తూ, వీడియోలో చెప్తున్న చిట్కాకి శాస్త్రీయత లేదని, అది ఫేక్ అని స్పష్టం చేసారు. వీడియోలో ఉన్నది తానూ కాదని కూడా స్పష్టం చేసారు.

సాధారణంగా జలుబు, దగ్గు మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి పొడి, తేనె, అల్లం రసం యొక్క మిశ్రమాన్ని వాడుతుంటారు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). ఐతే వీటి ద్వారా కరోనాని నియంత్రించవచ్చు అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

గతంలో పలు కరోనా చిట్కాలు సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు, FACTLY వాటిని ఫాక్ట్-చెక్ చేస్తూ రాసిన కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

చివరగా, శొంఠి పొడి ద్వారా కరోనాను నివారించవచ్చు అనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll