Fake News, Telugu
 

జనం ఎవరూ లేకున్నా ప్రధాని మోదీ చేయి ఊపుతున్నాడని అన్నది తప్పు; అక్కడ జనం ఉన్నారు

0

జనం ఎవరూ లేకుండా ఖాళీగా ఉన్నా, ప్రధాని మోదీ చేయి ఊపుతున్నట్టు వ్యంగ్యంగా రాస్తూ, ఒక వీడియోని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: జనం ఎవరూ లేకున్నా ప్రధాని మోదీ చేయి ఊపుతున్న వీడియో.

ఫాక్ట్: పోస్ట్‌లోని వీడియో యొక్క మెరుగైన వెర్షన్ చూస్తే, అందులో బ్యాక్‌గ్రౌండ్‌లో జనాలు ఉన్నట్టు కనిపిస్తారు. అంతేకాదు, పోస్ట్ చేసిన వీడియోలో ఆడియో మార్చి, జనం లేనట్టు అనిపించేలా చేసారు. కావున పోస్ట్‌లో చెప్పింది తప్పు.

పోస్ట్‌లోని వీడియో యొక్క స్క్రీన్‌షాట్స్‌ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్‌లో వెతకగా, ‘ANI News’ వారు అలాంటి వీడియోనే వారి యూట్యూబ్ ఛానల్‌లో పెట్టినట్టు తెలిసింది. వారు పోస్ట్ చేసిన మెరుగైన వెర్షన్ వీడియో చూస్తే, అందులో బ్యాక్‌గ్రౌండ్‌లో జనాలు ఉన్నట్టు చూడొచ్చు. అంతేకాదు, ఉన్నావ్‌లో ప్రధాని మోదీకి స్వాగతం పలకడానికి  హెలిప్యాడ్‌ దగ్గర చాలా జనం వచ్చినట్టు ‘ANI News’ వారు రాసారు. అదే వీడియోని ఉత్తరప్రదేశ్ బీజేపీ ట్విట్టర్ అకౌంట్ కూడా పోస్ట్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు.

అంతేకాదు, పోస్ట్ చేసిన వీడియోలో ఆడియో మార్చి, జనం లేనట్టు అనిపించేలా చేసారు. అదే ప్రదేశానికి సంబంధించి వివిధ వార్తసంస్థలు ప్రచురించిన ఫోటోలు చూడగా, అక్కడ జనం ఉన్నట్టు తెలుస్తుంది. కొన్ని  ఫోటోలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

చివరగా, జనం ఎవరూ లేకున్నా ప్రధాని మోదీ చేయి ఊపుతున్నాడని అన్నది తప్పు; అక్కడ జనం ఉన్నారు.

Share.

About Author

Comments are closed.

scroll