Fake News, Telugu
 

గాంధీ వ్యక్తిగతంగా బ్రిటిష్ ప్రభుత్వం నుండి నెలకు రూ.100 భత్యం పొందలేదు; ఈ మొత్తాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఆయన నిర్వహణ ఖర్చుల కోసం జైళ్ల శాఖకు కేటాయించింది

0

“జాతీయ ఆర్కియాలజికల్ మ్యూజియం నుండి సేకరించిన ఈ పత్రం ప్రకారం, బ్రిటిష్ ప్రభుత్వం 1930 నుండి ప్రతి నెల గాంధీకి ₹100 రూపాయలు వ్యక్తి గత ఖర్చుల కోసం చెల్లించేది” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ పోస్టుకు మద్దతుగా ఒక పురాతన పత్రాన్ని జత చేసి షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: గాంధీ బ్రిటిష్ ప్రభుత్వం నుండి నెలకు రూ.100 రూపాయలు భత్యంగా పొందారు.

ఫాక్ట్(నిజం): ఎరవాడ సెంట్రల్ జైలులో రాష్ట్ర ఖైదీగా ఖైదు చేయబడిన ఎం.కే గాంధీ నిర్వహణ కోసం రూ.100 భత్యం బ్రిటిష్ ప్రభుత్వం జైళ్ల శాఖకు మంజూరు చేసింది. అంతేకానీ ఆ మొత్తాన్ని నేరుగా గాంధీకి అందజేయబడలేదు. అంతేకుండా, అనేకమంది రాజకీయ ఖైదీలు, విప్లవకారులు జైళ్లలో ఉన్నప్పడు వాళ్ల కోసం ఇలాంటి భత్యాలను బ్రిటిష్ ప్రభుత్వం మంజూరు చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ముందుగా వైరల్ పోస్టులో చెప్పినట్లుగా గాంధీ బ్రిటిష్ ప్రభుత్వం నుండి నెలకు ₹100 రూపాయలు భత్యంగా పొందారా?లేదా అని తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, నేషనల్ ఆర్కైవ్స్ వెబ్‌సైట్‌లో “Papers Regarding Mr MK Gandhi’S Treatment in Jail While Confined Under the Bombay Regulation Xxv of 1827 Expenditure Incurred on Account of the Allowance of Rs 100- PM Sanctioned to Mr MK Gandhi While Congress to State Prisoner” అనే శీర్షికతో ప్రచురించబడిన పత్రం/ డాక్యుమెంట్ లభించింది (ఆర్కైవ్డ్). ఈ వైరల్ పోస్టులో ఉన్న పత్రాన్ని ఇండియా కల్చర్ అధికారిక (నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా) వెబ్‌సైట్ పేజీ 51లో చూడవచ్చు.

గాంధీ నేరుగా భత్యం పొందలేదు:

బొంబాయి ప్రభుత్వ హోం శాఖ కార్యదర్శిగా పనిచేసిన GFS కాలిన్స్ ఈ లేఖను భారత ప్రభుత్వ హోం శాఖ కార్యదర్శికి రాశారు. ఈ లేఖలో, కాలిన్స్ ఎరవాడ సెంట్రల్ జైలులో రాష్ట్ర ఖైదీగా ఖైదు చేయబడిన ఎంకే గాంధీ నిర్వహణ కోసం రూ.100 భత్యం ఆమోదించబడింది, ఈ మొత్తం ’29-రాజకీయ కేంద్ర శరణార్థులు మరియు రాష్ట్ర ఖైదీలు- ఇతర శరణార్థులు మరియు రాష్ట్ర ఖైదీల’ పద్దు కింద భారత ప్రభుత్వానికి డెబిట్ చేయబడింది అని పేర్కొన్నారు. అంటే ఈ మొత్తం జైళ్ల శాఖకు ఎంకే గాంధీ నిర్వహణ నిర్వహణ కోసం అందించబడింది. అంతేకానీ ఆ మొత్తాన్ని నేరుగా గాంధీకి అందజేయబడలేదు.

బ్రిటిష్ వారు రాష్ట్ర ఖైదీలుగా ఉన్న వారి నిర్వహణ కోసం నిధులు కేటాయించడం సాధారణ ప్రక్రియ:

బ్రిటిష్ పాలనలో 1818 బెంగాల్ స్టేట్ ఖైదీల నియంత్రణ ఆక్ట్ ప్రకారం, నిర్బంధంలో ఉన్న ముఖ్యమైన రాష్ట్ర ఖైదీలకు ప్రభుత్వం భత్యం అందించడం ఒక సాధారణ ప్రక్రియ. వైరల్ పోస్టులో ఉన్న లేఖ గాంధీని రాష్ట్ర ఖైదీగా సూచిస్తున్నందున, జైలులో గాంధీ నిర్వహణ కోసం ’29-రాజకీయ కేంద్ర శరణార్థులు మరియు రాష్ట్ర ఖైదీలు- ఇతర శరణార్థులు మరియు రాష్ట్ర ఖైదీలు’ పద్దు కింద భారత ప్రభుత్వా ఖాతా నుండి రూ.100 భత్యం డ్రా చేయబడింది అని తెలుస్తుంది. అప్పుడు ఉన్న చట్టాల ప్రకారమే, గాంధీ ఈ భత్యాన్ని పొందినట్లు స్పష్టమవుతుంది (ఇక్కడ).

అనేక మంది ఇతర ఖైదీలు కూడా ఇలాంటి భత్యం పొందారు:

వాస్తవానికి, అనేకమంది రాజకీయ ఖైదీలు, విప్లవకారులు జైళ్లలో ఉన్నప్పడు ఇలాంటి భత్యాలను పొందారు. అయితే, ప్రభుత్వ అధికారుల అభీష్టానుసారం వారికి కేటాయించిన భత్యం మొత్తం మారుతూ ఉంటుంది. అలాగే వైరల్ పోస్టులో ఉన్న లేఖను మనం నిశితంగా పరిశీలిస్తే, బెంగాల్‌కు చెందిన సతీష్ చంద్ర పక్రాషి అనే రాష్ట్ర ఖైదీకి నిర్వహణ కోసం కూడా రూ.100 భత్యం కేటాయించడం మనం చూడవచ్చు.

ఇండియా కల్చర్ వెబ్‌సైట్‌లో 1818 నిబంధన ప్రకారం తమకు భత్యం అందించాలని అభ్యర్థిస్తూ మాండలే జైలు నుండి పలువురు రాష్ట్ర ఖైదీలు సమర్పించిన  పిటిషన్‌లను (ఆర్కైవ్డ్), మనం చూడవచ్చు (ఇక్కడ). దీన్ని బట్టి బ్రిటిష్ ప్రభుత్వం గాంధీకి మాత్రమే కాకుండా ఇతర వ్యక్తులకు కూడా ఇలాంటి భత్యం మంజూరు చేసింది అని మనం నిర్ధారించవచ్చు.

గాంధీ భత్యాన్ని అంగీకరించడానికి నిరాకరించారు:

10 మే 1930న, గాంధీ ఎరవాడ జైలు నుండి బొంబాయి ప్రెసిడెన్సీకి ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్‌గా పనిచేసిన EE డోయల్‌కు రాసిన లేఖలో (ఆర్కైవ్డ్), తన నిర్వహణకు అంత బడ్జెట్ అవసరం లేదని పేర్కొన్నారు. దీన్ని బట్టి  గాంధీ తన నెలవారీ భత్యాన్ని అంగీకరించడానికి నిరాకరించినట్లు తెలుస్తుంది. ఈ లేఖలో మహాత్మా గాంధీ “ప్రభుత్వం రూ. 100 నెలవారీ భత్యం. దాని దగ్గర నాకు ఏమీ అవసరం లేదని నేను ఆశిస్తున్నాను. నా ఆహారం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని నాకు తెలుసు. ఇది నాకు దుఃఖం కలిగిస్తుంది, కానీ అది నాకు భౌతిక అవసరంగా మారింది” అని రాశారు .( ఇంగ్లీషు నుండి తెలుగులోకి అనువదించగా).

చివరగా, గాంధీ బ్రిటిష్ ప్రభుత్వం నుండి నెలకు రూ.100 భత్యాన్ని వ్యక్తిగతంగా పొందలేదు. ఎరవాడ సెంట్రల్ జైలులో రాష్ట్ర ఖైదీగా ఖైదు చేయబడిన ఎం.కే గాంధీ నిర్వహణ కోసం రూ.100 భత్యం బ్రిటిష్ ప్రభుత్వం జైళ్ల శాఖకు మంజూరు చేసింది.

Share.

About Author

Comments are closed.

scroll