Fake News, Telugu
 

ఆల్కహాల్ మరియు ధూమపానం కలిపితే వచ్చే నష్టాల కంటే పామ్ ఆయిల్‌ వల్ల వచ్చే నష్టాలే ఎక్కువ అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు

0

ఆల్కహాల్ మరియు ధూమపానం కలిపితే వచ్చే నష్టాల కంటే పామ్ ఆయిల్‌ వల్ల వచ్చే నష్టాలే ఎక్కువ అంటూ ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: ఆల్కహాల్ మరియు ధూమపానం కలిపితే వచ్చే నష్టాల కంటే పామ్ ఆయిల్‌ వల్ల వచ్చే నష్టాలే ఎక్కువ.

ఫాక్ట్: ఆల్కహాల్ మరియు ధూమపానం కలిపితే వచ్చే నష్టాల కంటే పామ్ ఆయిల్‌ వల్ల వచ్చే నష్టాలే ఎక్కువ అనడానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. పామ్ ఆయిల్‌లో సంతృప్త కొవ్వులు (saturated fats) ఉంటాయి, ఇది హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. సంతృప్త కొవ్వులు ఎక్కువగా కలిగి ఉన్న కొన్ని ఇతర నూనెలు కూడా ఉంటాయి. పామ్ ఆయిల్‌ వాటిలో ఒకటి. ఏ నూనె అయినా ఎక్కువ మోతాదులో తీసుకుంటే ప్రమాదమే, పామ్ ఆయిల్‌ ఒక్కటే కాదు. అయితే, పామ్ ఆయిల్‌లో మోనోశాచురేటెడ్ (Monosaturated) మరియు పాలీఅన్‌శాచురేటెడ్ (Polyunsaturated) ఫ్యాటీ యాసిడ్‌లను కలిగి ఉన్నందున కొద్దిగా భిన్నంగా మరియు ప్రమాదకరం కూడా. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఆల్కహాల్ మరియు ధూమపానం కలిపిన దానికంటే పామాయిల్ ప్రమాదకరమని తెలపడానికి ఎటువంటి సమాచారం లభించలేదు.

2018లో టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రచురించిన ఆర్టికల్ ప్రకారం, EMRI ఫలితాలు ప్రకారం, గుండెపోటు వచ్చిన వారిలో సుమారు 50% మంది 50 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నవారే. రానున్నరోజుల్లో, యుక్తవయస్సులో మరణించే వారిలో 50 శాతం మంది మధుమేహం మరియు గుండె జబ్బులతో మరణిస్తారని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అంచనా వేసినట్లు కొన్ని కథనాలు చూడొచ్చు (ఇక్కడ మరియు ఇక్కడ). వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ యొక్క రిపోర్ట్ అయితే మాకు లభించలేదు.

ప్రపంచంలో పామాయిల్ ను అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం భారతదేశం. దాదాపు 9 మిలియన్ టన్నులు ప్రతి సంవత్సరం ముఖ్యంగా ఇండోనేషియా, మలేషియా నుండి దిగుమతి చేస్తాం.

పామ్ ఆయిల్‌లో సంతృప్త కొవ్వులు (saturated fats) ఉంటాయి, ఇది హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. సంతృప్త కొవ్వులు ఎక్కువగా కలిగి ఉన్న కొన్ని ఇతర నూనెలు కూడా ఉంటాయి. పామ్ ఆయిల్‌ వాటిలో ఒకటి. ఇటువంటి నూనెలు ఎక్కువ మోతాదులో తీసుకుంటే ప్రమాదమే, పామ్ ఆయిల్‌ ఒక్కటే కాదు. అయితే, పామ్ ఆయిల్‌లో మోనోశాచురేటెడ్ (Monosaturated) మరియు పాలీఅన్‌శాచురేటెడ్ (Polyunsaturated) ఫ్యాటీ యాసిడ్‌లను కలిగి ఉన్నందున కొద్దిగా భిన్నంగా ఉంటుంది.

చివరగా, ఆల్కహాల్ మరియు ధూమపానం కలిపితే వచ్చే నష్టాల కంటే పామ్ ఆయిల్‌ వల్ల వచ్చే నష్టాలే ఎక్కువ అనడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll