Fake News, Telugu
 

“మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అయోధ్యలో రామమందిర పనులను నిలిపివేస్తాం” అని సమాజ్‌వాదీ పార్టీ నేత ఇమ్రాన్ మసూద్ అన్నట్టుగా ఎటువంటి ఆధారాలు లేవు

0

“మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అయోధ్యలో రామమందిర పనులను నిలిపివేస్తాం”, అని సమాజ్‌వాదీ పార్టీ నేత ఇమ్రాన్ మసూద్ అన్నట్టు ఒక పోస్ట్ ద్వారా సోషల్ మీడియాలో బాగా షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: “మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అయోధ్యలో రామమందిర పనులను నిలిపివేస్తాం” – సమాజ్‌వాదీ పార్టీ నేత ఇమ్రాన్ మసూద్.

ఫాక్ట్: “మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అయోధ్యలో రామమందిర పనులను నిలిపివేస్తాం” అని ఇమ్రాన్ మసూద్ అన్నట్టుగా ఎటువంటి ఆధారాలు దొరకలేదు. 2019లో అయోధ్య రామమందిరానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు, ఆ తీర్పును అందరూ గౌరవించి ఆమోదించాలని ఇమ్రాన్ మసూద్ తెలిపారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాలి, కానీ చట్ట పరిధిలో జరగాలి అంటూ సుప్రీంకోర్టు తీర్పు రాకముందు 2018లో వ్యాఖ్యలు చేసారు. కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీని వీడి ఇమ్రాన్ మసూద్ సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. కావున, పోస్ట్ ద్వారా చెప్పేది తప్పు.        

పోస్టులో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఇమ్రాన్ మసూద్ అలా అన్నట్టు ఎక్కడా కూడా ఎటువంటి సమాచారం లేదు. ఒకవేళ నిజంగానే అటువంటి వ్యాఖ్యలు చేసుంటే, వార్తాపత్రికలు దాని గురించి ప్రచురించేవి.

కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీని వీడి ఇమ్రాన్ మసూద్ సమాజ్‌వాదీ పార్టీలోకి వచ్చినట్టు తెలుస్తుంది. 2019లో అయోధ్య రామమందిరానికి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు, ఆ తీర్పును అందరూ గౌరవించి ఆమోదించాలని ఇమ్రాన్ మసూద్ తెలిపారు. అయోధ్య రామమందిరం గురించి 2018లో, సుప్రీంకోర్టు తీర్పు రాకముందు కూడా మందిర నిర్మాణానికి అనుకూలంగానే వ్యాఖ్యానించినట్టు ఈ ఆర్టికల్‌లో తెలుస్తుంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరగాలి, కానీ చట్ట పరిధిలో జరగాలి అంటూ వ్యాఖ్యలు చేసారు.

2014 జాతీయ ఎన్నికల ముందు నరేంద్ర మోదీని ముక్కలు ముక్కలు చేస్తానని కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. కానీ, “మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అయోధ్యలో రామమందిర పనులను నిలిపివేస్తాం” అని ఇమ్రాన్ మసూద్ అన్నట్టు ఎటువంటి ఆధారాలు దొరకలేదు.

చివరగా, “మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అయోధ్యలో రామమందిర పనులను నిలిపివేస్తాం” అని సమాజ్‌వాదీ పార్టీ నేత ఇమ్రాన్ మసూద్ అన్నట్టుగా ఎటువంటి ఆధారాలు లేవు.

Share.

About Author

Comments are closed.

scroll