జులై 2022లో భారతదేశ మొట్టమొదటి ఆదివాసీ మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికైన నేపధ్యంలో, భారతదేశానికి ఒక గిరిజన మహిళా రాష్ట్రపతిగా ఎన్నికైన రోజున దేశంలో రిజర్వేషన్‌లను రద్దు చేయాలని డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ చెప్పినట్లు ఒక పోస్టు విస్తృతంగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: భారత దేశానికి ఒక గిరిజన మహిళా రాష్ట్రపతిగా ఎన్నికైన రోజున రిజర్వేషన్‌లను రద్దు చేయాలని అంబేడ్కర్ అన్నారు.
ఫాక్ట్: అంబేడ్కర్ ఇటువంటి వ్యాఖ్యలు చేసినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. రాజ్యాంగ పరిషత్ చర్చలలో కానీ, ఆయన రచనలు మరియు ఉపన్యాసాలలో కూడా అంబేడ్కర్ ఈ వ్యాఖ్యలు చేయలేదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
అంబేడ్కర్ ఇటువంటి వ్యాఖ్యలు ఏమైనా చేశారా అని ఇంటర్నెట్లో వెతకగా, మాకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. భారత దేశ మొట్టమొదటి ఆదివాసీ మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికైన నేపథ్యంలో, ఒకవేళ అంబేడ్కర్ ఈ వ్యాఖ్యలను చేసి ఉంది ఉంటే, మీడియా వీటిని గురుంచి రాసి ఉండేది. కానీ, అంబేడ్కర్ ఇలా చెప్పినట్లు మీడియాలో ఎక్కడా రిపోర్ట్ కాలేదు.
రాజ్యాంగ పరిషత్ చర్చలలో కూడా ఆయన ఈ వ్యాఖ్యలను చేయలేదు. రిజర్వేషన్ల గురించి అంబేడ్కర్ చేసిన ప్రసంగాలను ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.
అలాగే, అంబేడ్కర్ రచించిన ‘కుల నిర్మూలన’ పుస్తకంలో కానీ, ఆయన చేసిన ఇతర ఉపన్యాసాలు మరియు రచనలలో కానీ ఎక్కడా కూడా ఈ వ్యాఖ్యలు చేయలేదు.
చివరిగా, భారత్‌కు గిరిజన మహిళా రాష్ట్రపతి అయిన రోజున రిజర్వేషన్‌లను రద్దు చేయాలని అంబేడ్కర్ ఎక్కడా చెప్పలేదు.