కొంతమంది వ్యక్తులు, గుడిలో నిలబడి సాయి బాబా విగ్రహాన్ని పడగొట్టిస్తున్న వీడియోను పోస్టు చేస్తూ, “సాయిబాబా ముస్లిం అని కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం వల్ల, అన్ని బాబా గుళ్ళలో సాయిబాబా విగ్రహం తొలగించి, మన హిందూ దేవి దేవతల విగ్రహాలు ప్రతిష్టిస్తున్నారు” అని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
క్లెయిమ్: సాయిబాబా ముస్లిం అని కోర్టు ఉత్తర్వులు జారీ చేయడం వల్ల, అన్ని బాబా గూళ్ళలో సాయిబాబా విగ్రహం తొలగించి, హిందూ దేవి దేవతల విగ్రహాలు ప్రతిష్టిస్తున్నారు.
ఫాక్ట్(నిజం): వైరల్ వీడియోలోని సంఘటన 25 మార్చి 2021న దక్షిణ ఢిల్లీలోని షాపూర్ జాట్‌లోని ఆలయంలో చోటు చేసుకుంది. కొంతమంది హిందువులు సాయిబాబా విగ్రహాన్ని ధ్వంసం చేసి ఆ స్థానంలో గణేష్ విగ్రహం స్థాపించారు. కాకపోతే, ఏ కోర్టూ సాయి బాబా ముస్లిం అంటూ ఉత్తర్వులు జారీ చేసినట్టు ఆధారాలు లేవు. పైగా, అక్టోబర్ 2014 లో మహారాష్ట్రకు చెందిన సాయిధామ్ ఛారిటబుల్ ట్రస్ట్ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి సాయి బాబా గురించి చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన PILకు స్పందిస్తూ, సుప్రీం కోర్టు ఈ వివాదంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. కావున, ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
ముందుగా, ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ గురించి తెలుసుకోవటానికి తగిన కీ వర్డ్స్ ఉపగించి ఇంటర్నెట్లో వెతియితే, ఈ సంఘటన 25 మార్చి 2021న దక్షిణ ఢిల్లీలోన షాపూర్ జాట్‌లోని ఆలయంలో చోటు చేసుకుంది అని పలు రిపోర్ట్ల ద్వారా తెలుసుకున్నాం (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). ఈ నివేదికల ప్రకారం కొంతమంది హిందువులు సాయిబాబా విగ్రహాన్ని ధ్వంసం చేసి. విగ్రహం విరిగిన తర్వాత తొలగించారు. కానీ, స్క్రోల్ ప్రచురించిన సవివరమైన గ్రౌండ్ రిపోర్టు ప్రకారం ఆలయంలోని సాయిబాబా విగ్రహాన్ని ద్వంసం చేసి ఆ స్థానంలో గణేష్ విగ్రహం స్థాపించినట్టు తేలింది. ఈ వివరణతో ఆ ప్రాంతంలోని సాయిబాబా భక్తులు అసహనం వ్యక్తం చేశారు. పదమ్ పన్వార్ అనే వ్యక్తి మీద విగ్రహాన్ని ద్వంసం చేసినందుకు ఐపీసీ సెక్షన్ 295-ఏ కింద ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
సాయి బాబాను ముస్లింగా నిర్ధారించిన కోర్టు ఆదేశం యొక్క నివేదికల కోసం వెతికితే, ఏ కోర్టూ అటువంటి ఆదేశాలు చేసినట్టు ఆధారాలు మాకు దొరకలేదు. అయితే, దీని గురించి మరింత వెతికితే, ఈ వివాదానికి సంబంధించిన నివేదికలకు దారితీసింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రకారం, ద్వారకాపీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సాయిబాబాను ‘ముస్లిం ఫకీర్’ అంటూ చేసిన అనుచిత వ్యాక్యలు (ఇక్కడ మరియు ఇక్కడ) చేశారని. ఈ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా, సాయిబాబాను “అవమానించి, కించపరిచే” వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ, కందివలికి చెందిన సాయి ధామ్ ఆలయం యొక్క ట్రస్ట్ బొంబాయి హైకోర్టును 2014లో ఆశ్రయించింది.
తరువాత అక్టోబర్ 2014 లో మహారాష్ట్రలోని సాయిధామ్ ఛారిటబుల్ ట్రస్ట్ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతికి వ్యతిరేకంగా దాఖలు చేసిన PILకు స్పందిస్తూ, సుప్రీం కోర్టు ఈ వివాదంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. సాయి భక్తులు కావాలంటే స్వరూపానంద సరస్వతి పై క్రిమినల్/సివిల్ కేసు దావా వేయవచ్చని అభిప్రాయపడింది.
చివరిగా, సాయి బాబా ముస్లిం అని ఏ కోర్టూ ఉత్తర్వులు జారీ చేయలేదు; సాయి బాబా విగ్రహాన్ని తొలగిస్తున్న ఈ ఘటన 2021లో ఢిల్లీలో చోటు చేసుకుంది.