Coronavirus, Coronavirus Telugu, Fact Check, Fake News, Telugu
 

అమెరికాలో కరోనా కారణంగా 25 వేల మందికి పైగా పిల్లలు చనిపోయారనేది ఫేక్ న్యూస్.

0

అమెరికాలో స్కూళ్లు ప్రారంభమైన రెండు వారాల్లోనే 97 వేల మంది చిన్నారులకు కరోనా వచ్చిందని చెప్తూ, ఒక మెసేజ్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ మెసేజ్ లో ఇప్పటివరకు అమెరికాలో దాదాపు 25 వేల మందికి పైగా పిల్లలు కరోనా కారణంగా చనిపోయారని ఉంది. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా):  అమెరికాలో ఇప్పటివరకు దాదాపు 25 వేల మందికి పైగా పిల్లలు కరోనా కారణంగా చనిపోయారు.

ఫాక్ట్ (నిజం):  సీడీసీ వారి వెబ్సైటులో ఇచ్చిన సమాచారం ప్రకారం 17 ఏళ్ళ వయసు వరకు తీసుకుంటే కరోనా కారణంగా వంద (100) మంది కూడా చనిపోలేదు. జూలై చివరి రెండు వారాల్లో సుమారు 97,000 మంది పిల్లలను కరోనా పాజిటివ్ వచ్చిందని ‘అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్’ మరియు ‘చిల్డ్రన్స్ హాస్పిటల్ అసోసియేషన్’ వారి రిపోర్ట్ లో చదవొచ్చు. అయితే, అమెరికా లో స్కూళ్లు తెరవడం వల్ల ఆ పిల్లలకి కరోనా వచ్చినట్టు రిపోర్ట్ లో ఎక్కడా లేదు. ఆ రెండు వారాల్లో వివిధ రాష్ట్రాలు నుండి వచ్చిన డేటా ప్రకారం అంతమంది పిల్లలకు కరోనా వచ్చిందని వారు తెలిపారు. ఎలా మరియు ఎందుకు వచ్చిందనే విషయాలు ఆ రిపోర్ట్ లో లేవు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లో ఇచ్చిన సమాచారం గురించి ఇంటర్నెట్ లో వెతకగా, దానికి సంబంధించి ‘At least 97,000 children in the U.S. tested positive for the coronavirus in the last two weeks of July’ (అమెరికాలో జూలై చివరి రెండు వారాల్లో కనీసం 97,000 మంది పిల్లలను కరోనా పాజిటివ్ వచ్చింది) అనే టైటిల్ తో ‘ది న్యూయార్క్ టైమ్స్’ వారు ప్రచురించిన ఆర్టికల్ సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ ఆర్టికల్ లో ‘అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్’ మరియు ‘చిల్డ్రన్స్ హాస్పిటల్ అసోసియేషన్’ వారి రిపోర్ట్ నుండి సమాచారం తీసుకోబడినట్టు రాసి ఉంటుంది.

ఆ రిపోర్ట్ ని ఇక్కడ చూడవొచ్చు. జూలై చివరి రెండు వారాల్లో సుమారు 97,000 మంది పిల్లలకు కరోనా పాజిటివ్ వచ్చిందని ఆ రిపోర్ట్ లో చదవొచ్చు. అయితే, అమెరికా లో స్కూళ్లు తెరవడం వల్ల ఆ పిల్లలకి కరోనా వచ్చినట్టు రిపోర్ట్ లో ఎక్కడా లేదు. ఆ రెండు వారాల్లో వివిధ రాష్ట్రాలు నుండి వచ్చిన డేటా ప్రకారం అంతమంది పిల్లలకు కరోనా  వచ్చిందని వారు తెలిపారు. ఎలా మరియు ఎందుకు వచ్చిందనే విషయాలు ఆ రిపోర్ట్ లో లేవు. అంతేకాదు, వారు తీసుకున్న డేటా సమానంగా లేదని, వివిధ రాష్ట్రాలు పిల్లలను వివిధ వయసుల్లో పెట్టారని ఆ రిపోర్ట్ లో రాసి ఉంటుంది.

అమెరికాలోని అన్నీ స్కూళ్లను తెరవలేదు. కొన్ని ప్రాంతాల్లోని కొన్ని స్కూళ్ళు మాత్రమే తెరవబడినట్టు ఇక్కడ, ఇక్కడ మరియు  ఇక్కడ చదవొచ్చు.

కరోనా కారణంగా స్కూళ్లు తెరవాలా వద్దా?

కరోనాకి ఇంకా వాక్సిన్ రాకపోవడంతో స్కూళ్లు తెరవాలా లేదా, తెరిస్తే ఎప్పుడు తెరవాలి, ఎలా తెరవాలి అనే విషయాల పై సర్వత్రా చర్చ జరుగుతుంది. పై రిపోర్ట్ ఇచ్చిన  ‘అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్’ వారి వెబ్సైటులో స్కూళ్ళు తెరవాలని చెప్తూ, స్కూళ్ళు తెరవడం వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనాలు ఇచ్చినట్టు చూడవొచ్చు. అయితే, ఆయా ప్రాంతాల్లోని పరిస్థితుల బట్టి నిర్ణయం తీసుకోవాలని, ఒకటే రూల్ ప్రతి చోటా పనిచేయదని వారు తెలిపారు. సీడీసీ (‘Centers for Disease Control and Prevention’) వారు కూడా స్కూళ్ళు తెరవడం వల్ల పిల్లలకు కలిగే ప్రయోజనాలు గురించి వారి వెబ్సైటులో పెట్టినట్టు ఇక్కడ చూడవొచ్చు.

అయితే, అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే అభివృద్ధి చెందుతున్న దేశాలలో స్కూళ్లు మూయడం వల్ల ఎక్కువ ప్రాణాలు కాపాడవచ్చని ‘నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్’ వారి రీసెర్చ్ పేపర్ లో చదవొచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో స్కూళ్ళు రద్దీగా ఉండడం మరియు ఉమ్మడి కుటుంబాల వల్ల ఇళ్లల్లో పిల్లల నుండి వృద్ధులకు వైరస్ సోకే అవకాశం ఎక్కువ అని వారు తెలిపారు.

అమెరికాలో కరోనా కారణంగా చనిపోయిన పిల్లల సంఖ్య ఎంత?

పోస్టులో అమెరికాలో ఇప్పటివరకు దాదాపు 25 వేల మందికి పైగా పిల్లలు కరోనా కారణంగా చనిపోయారని రాసి ఉంటుంది. అయితే, ‘అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్’ మరియు ‘చిల్డ్రన్స్ హాస్పిటల్ అసోసియేషన్’ వారి రిపోర్ట్ లో ఎక్కడా 25 వేల మంది పిల్లలు కరోనా కారణంగా చనిపోయారని రాసి లేదు. ఈ రిపోర్ట్ లో 31 జులై 2020 వరకు అమెరికాలోని 44 రాష్ట్రాలు, న్యూయార్క్ నగరం కలిపి 1,33,267 మంది కరోనా కారణంగా మరణించారు అని ఉంది. అందులో మరణించిన పిల్లల సంఖ్య 86, అంటే మరణాల్లో 0.06%. అమెరికాలోని మొత్తం కరోనా మరణాల్లో  పిల్లల మరణాలు 0.1 శాతం కూడా లేదని దానర్థం.

సీడీసీ వారి వెబ్సైటులో ఇచ్చిన సమాచారం ప్రకారం 17 ఏళ్ళ వయసు వరకు తీసుకుంటే కరోనా కారణంగా వంద మంది కూడా చనిపోలేదు. కావున, పోస్ట్ లో చెప్పింది తప్పు.

చివరగా, అమెరికాలో కరోనా కారణంగా ఇప్పటి వరకు చనిపోయిన పిల్లల సంఖ్య 100 కూడా లేదు, 0.1% శాతం కంటే తక్కువ మంది పిల్లలు చనిపోయారు. పోస్టులో చెప్పినట్టుగా అమెరికాలో కరోనా కారణంగా 25 వేల మందికి పైగా పిల్లలు చనిపోలేదు. అది ఫేక్ న్యూస్.

Share.

About Author

Comments are closed.

scroll