Fake News, Telugu
 

అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రజలు చూడకుండా కేరళ ప్రభుత్వం ఆ రోజు రాష్ట్రమంతా విద్యుత్ నిలిపివేయనుందన్న వార్త నిజం కాదు

0

22 జనవరి 2024 నాడు అయోధ్యలో జరగబోయే రామ మందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రజలు చూడకుండా కేరళ ప్రభుత్వం ఆ రోజు రాష్ట్రమంతా విద్యుత్ సరఫరా/నిర్వహణ మెయింటెనెన్స్ కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్తున్న వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. ఇలా చేయడం ద్వారా ఆ రోజు రాష్ట్రంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజులు ఈ కార్యక్రమాన్ని చూడకుండా చేయడం ప్రభుత్వం యొక్క ఉద్దేశం అని ఈ వార్తను షేర్ చేసిన పోస్టులలో చెప్తున్నారు. ఐతే ఈ కథనం ద్వారా ఆ వార్తలో నిజమెంతుందో చూద్దాం.

క్లెయిమ్: అయోధ్యలో జరగబోయే రామ మందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రజలు చూడకుండా కేరళ ప్రభుత్వం ఆ రోజు రాష్ట్రమంతా విద్యుత్ సరఫరా నిలిపివేయనుంది.

ఫాక్ట్(నిజం): అయోధ్యలో జరగబోయే రామ మందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రజలు చూడకుండా కేరళ ప్రభుత్వం రాష్ట్రమంతా విద్యుత్ సరఫరా మెయింటెనెన్స్ కార్యక్రమాన్ని చేపట్టిందన్న వార్త వాస్తవం కాదని KSEB తెలిపింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

అయోధ్యలో జరగబోయే రామ మందిర ప్రాణప్రతిష్ట రోజున టీవీలు ఆన్ చేయొద్దంటు కేరళ కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన మాజీ పార్లమెంట్ సభ్యుడు పీ.కే. బిజూ పిలుపిచ్చాడన్న వార్తను కూడా ప్రస్తుతం షేర్ అవుతున్న పోస్టులో చెప్తున్నారు. ఐతే పీ.కే. బిజూ ఇటీవల నిజంగానే ఈ వ్యాఖ్యలు చేసినట్టు పలు వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి (ఇక్కడ & ఇక్కడ).

కానీ, కేరళ ప్రభుత్వం అయోధ్యలో జరగబోయే రామ మందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రజలు చూడకుండా ఆ రోజు రాష్ట్రమంతా విద్యుత్ సరఫరా మెయింటెనెన్స్ నిర్వహించబోతుందన్న వార్తలో నిజం లేదు. ఒకవేళ ప్రభుత్వం నిజంగానే ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటే మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేది. కానీ, అయోధ్యలో రామ మందిర ప్రాణప్రతిష్ట జరగబోయే 22 జనవరి 2024 నాడు విద్యుత్ మెయింటెనెన్స్ పనులు జరుగనున్నాయని రిపోర్ట్ చేసిన కథనాలేవి మాకు కనిపించలేదు.

ఐతే ఈ అంశంపై వివరణ కోరుతూ కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డును (KSEB) మెయిల్ ద్వారా సంప్రదించాము. ఐతే మా మెయిల్‌కు స్పందిస్తూ  22 జనవరి 2024 నాడు విద్యుత్ మెయింటెనెన్స్ పనులు చేపట్టాలని ప్రభుత్వం సూచించిందన్న వార్త ఫేక్ అని స్పష్టం చేసారు. దీన్నిబట్టి కేరళ ప్రభుత్వానికి సంబంధించి షేర్ అవుతున్న ఈ వార్తలో నిజం లేదని తెలుస్తుంది.

చివరగా, అయోధ్య రామ మందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని ప్రజలు చూడకుండా కేరళ ప్రభుత్వం ఆ రోజు రాష్ట్రమంతా విద్యుత్ నిలిపివేయనుందన్న వార్త నిజం కాదు.

Share.

About Author

Comments are closed.

scroll