Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

ఒక సూఫీ ఆచారానికి సంబంధించిన వీడియో పెట్టి, కొరోనా వైరస్ ని వ్యాప్తి చేయడానికి ముస్లింలు శిక్షణ తీసుకుంటున్నారని షేర్ చేస్తున్నారు

0

బలంగా చీది కొరోనా వైరస్ ని వ్యాప్తి చేయడానికి శిక్షణ తీసుకుంటున్న ముస్లింల యొక్క వీడియో అని చెప్తూ సోషల్ మీడియా లో ఒక పోస్ట్ ని చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: వీడియోలో బలంగా చీది కొరోనా వైరస్ ని వ్యాప్తి చేయడానికి శిక్షణ తీసుకుంటున్న ముస్లింలు.

ఫాక్ట్ (నిజం): అది ఒక పాత వీడియో. ఇండియాలో కొరోనా మొదటి కేసు జనవరి 30 న కేరళ లో రిపోర్ట్ అయింది, కానీ పోస్టులోని వీడియో జనవరి 29 నుండి ఇంటర్నెట్ లో పాకిస్తాన్ కి చెందిన వీడియోగా షేర్ అవుతుంది. అంతేకాదు, వీడియోలో వాళ్ళు కొరోనా వైరస్ వ్యాప్తి చేయడానికి శిక్షణ తీసుకోవట్లేదు, అలా కిందికీ పైకీ తలను ఊపడం మరొయు గట్టిగా ఊపిరి పీల్చి వదలడం సూఫీ ముస్లింల యొక్క ఒక ఆచారం (‘జికర్’). కావున పోస్ట్ లో చెప్పిందితప్పు.

పోస్ట్ లోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, అదే వీడియోని జనవరి లో పోస్ట్ చేసినట్టుగా చాలా సెర్చ్ రిజల్ట్స్ వచ్చాయి. ఇండియాలో కొరోనా మొదటి కేసు జనవరి 30 న కేరళ లో రిపోర్ట్ అయింది, కానీ పోస్టులోని వీడియో జనవరి 29 నుండి ఇంటర్నెట్ లో పాకిస్తాన్ కి చెందిన వీడియోగా షేర్ అవుతుంది. ట్విట్టర్లో ఆ వీడియో పాకిస్తాన్ కి చెందిన వీడియోగా చాలా మంది పెటిన్నట్టు ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. పాకిస్తాన్ కి చెందిన ఒక టిక్ టాక్ స్టార్ కూడా ఆ వీడియోని జనవరి లోనే తన అకౌంట్ లో పెట్టుకున్నట్టు ఇక్కడ చూడవొచ్చు. అయితే, రెండు నెల్ల క్రితం పాకిస్తాన్ లో వైరల్ అయిన ఆ వీడియో తీసుకొని ఇప్పుడు తబ్లీక్ జమాత్ ఘటన తర్వాత ఇండియాలో కొరోనా వైరస్ వ్యాప్తి కోసం అలా శిక్షణ తీసుకుంటున్నారని షేర్ చేస్తున్నారు. ఒకరు అదే వీడియో పెట్టి, వీడియో టైటిల్ – ‘Sufi people doing strange rituals’ (సూఫీల వింత ఆచారాలు) అని పెట్టాడు.

అలాంటి సూఫీ ఆచారం ఏమైనా ఉందా అని వెతకగా, సూఫీలలో కూడా వివిధ గ్రూప్స్ ఉంటాయని, వాళ్ళు వివిధ ఆచారాలు పాటిస్తారని తెలుస్తుంది. వాటిలో వీడియోలో చూపెట్టినట్టు చేసే ఒక ఆచారం ‘జికర్’ అని తెలుస్తుంది. ‘జికర్’ కి సంబంధించిన వీడియోలను ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవొచ్చు. అయితే, ‘జికర్’ ని వివధ గ్రూప్స్ వివిధ రకాలుగా చేస్తారు. ‘పాన్ అన్ఫాస్’ అనే ‘జికర్’ రకం లో బాడీని కదుపుతూ, గట్టిగా ఊపిరి పిలుస్తారని తెలుస్తుంది. దాని గురించి మరింత సమాచారం ఇక్కడ చూడవొచ్చు.

చివరగా, ఒక సూఫీ ఆచారానికి సంబంధించిన వీడియో పెట్టి, కొరోనా వైరస్ ని వ్యాప్తి చేయడానికి ముస్లింలు శిక్షణ తీసుకుంటున్నారని షేర్ చేస్తున్నారు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll