Fake News, Telugu
 

పాత ఫోటోలను ఇప్పుడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల నిరసనలకు ముడి పెడుతున్నారు

0

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పుడు జరుగుతున్న రైతుల నిరసనలకు సంబంధించిన ఫోటోలు అని షేర్ చేస్తున్న కొన్ని ఫోటోలు ( ఫోటో1(ఆర్కైవ్డ్), ఫోటో2 (ఆర్కైవ్డ్), ఫోటో3 (ఆర్కైవ్డ్)) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పుడు జరుగుతున్న రైతుల నిరసనలకు సంబంధించిన ఫోటోలు.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటోలు 2016 మరియు 2017లో జరిగిన రైతుల ఆందోళనలకు సంబంధించినవి. ఈ ఫోటోలకు ఇప్పుడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పుడు జరుగుతున్న రైతుల ఆందోళనలకు ఎటువంటి సంబంధంలేదు.  కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఫోటో 1:

పోస్టులోని ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా CPI (M) ఈ ఫోటోని షేర్ చేస్తూ 2017లో చేసిన ఒక ట్వీట్ మాకు కనిపించింది. ఈ ట్వీట్ లో ఇచ్చిన వివరణ ప్రకారం ఈ ఫోటో రాజస్తాన్ లో అల్ ఇండియన్ కిసాన్ సభ నేతృత్వంలో రుణ మాఫీ, పెన్షన్ స్కీం మొదలైన విషయాలపై నిరసనల తెలుపుతున్న సందర్భానికి సంబంధించింది.

ఇదే ఫోటోని ప్రచురించిన ఒక వార్తా కథనం ఇక్కడ చూడొచ్చు, ఈ కథనం కూడా ఈ ఫోటో 2017లో రాజస్తాన్ లో జరిగిన రైతుల నిరసనలకు సంబంధించిందని చెప్తుంది.

ఫోటో 2:

ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోని షేర్ చేస్తూ 2018లో కేరళ ముఖ్యమంత్రి పినయారి విజయన్  చేసిన ట్వీట్ ఒక కనిపించింది. ఈ ట్వీట్ ప్రకారం ఈ ఫోటో CPM ఆధ్వర్యంలో మహారాష్ట్రలో రైతుల నిరసనకు సంబంధించింది.

ఈ ట్వీట్ ఆధారంగా గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా ఇలాంటిదే ఫోటో ప్రచురించిన ఒక 2018 వార్తా కథనం కనిపించింది. ఈ కథనం ప్రకారం ఈ ఫోటో ముంబైలో రైతుల నిరసనలకు సంబంధించింది.

ఫోటో 3:

ఈ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటోని 2016లో షేర్ చేసిన ఒక ఫేస్బుక్ పోస్ట్ మాకు కనిపించింది. ఐతే ఈ ఫోటో ఎక్కడిదన్న కచ్చితమైన సమాచారం మాకు లభించనప్పటికీ ఈ ఫోటోని 2016 నుండే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందని చెప్పొచ్చు. ఈ ఫోటోని 2016 మరియు 2018లో షేర్ చేసిన మరికొన్ని సోషల్ మీడియా పోస్టులు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల నిరసనల నేపధ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే పోస్టులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

చివరగా, ఈ ఫొటోలకి ఇప్పుడు జరుగుతున్న రైతుల నిరసనలకు సంబంధంలేదు.

Share.

About Author

Comments are closed.

scroll