Fake News, Telugu
 

2015లో సీతారాం ఏచూరి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను తన ‘బాస్’ గా పేర్కొంటూ ట్వీట్ చేయలేదు

0

2015లో సిపిఐ (ఎం ) నాయకుడు సీతారాం ఏచూరి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను తన ‘బాస్’ గా పేర్కొంటూ ట్వీట్ చేసారంటూ ఒక స్క్రీన్ షాట్ సోషల్ మీడియా లో చలామణి అవుతోంది. ఆ ట్వీట్ లోని మెసేజ్ ఈ విధంగా ఉంది –‘కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా సిపిఐ (ఎం) తో సంబంధాలకు విలువనిస్తోంది. ఎంతైనా నా ‘బాస్’ ని కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. అతను భారతదేశంలో ఇచ్చిన లక్ష్యాలను సాధించడానికి ఎదురు చూస్తున్నాను. # బీజింగ్ # ట్రిప్ రెడ్ సెల్యూట్!’. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం. 

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: సీతారాం ఏచూరి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను తన ‘బాస్’ గా పేర్కొంటూ ‘20 అక్టోబర్ 2015’ న ట్వీట్ చేసాడు. 

ఫాక్ట్ (నిజం): ): స్క్రీన్ షాట్ లోని ట్వీట్ ‘20 అక్టోబర్ 2015’ తేదీతో ఉంది కానీ అసలు  సీతారాం ఏచూరి ట్విట్టర్ లో అకౌంట్ ని తెరిచిందే ‘29 అక్టోబర్ 2015’ న. స్క్రీన్ షాట్ లోని ట్వీట్ డిజిటల్ గా ఫోటోషాప్ లాంటి సాఫ్ట్వేరు సహాయంతో రూపొందించబడింది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్టు లోని స్క్రీన్ షాట్ లో ఉన్న ట్వీట్ సీతారాం ఏచూరి చేసాడా అని ఆయన ఖాతా లో ట్విట్టర్ అడ్వాన్స్డ్ సెర్చ్ చేసినప్పుడు, ఆయన అలాంటి ట్వీట్ చేసినట్లుగా సమాచారమేమి లభించలేదు. అయితే, స్క్రీన్ షాట్ లోని ట్వీట్ లోని పదాల ఓరియంటేషన్ మరియు ట్విట్టర్ లోని ఒక ట్వీట్ లోని పదాల ఓరియంటేషన్ వేరుగా ఉన్నట్లుగా గమనించవచ్చు.

స్క్రీన్ షాట్ లోని ట్వీట్ ‘20 అక్టోబర్ 2015’ తేదీ తో ఉంది. కానీ సీతారాం ఏచూరి ట్విట్టర్ లో అకౌంట్ ని ‘29 అక్టోబర్ 2015’న తెరిచినట్లుగా ట్విట్టర్ అనలిటిక్స్ అప్లికేషన్ ‘Foller.me’ లో చూడవచ్చు. కావున, స్క్రీన్ షాట్ లోని ట్వీట్ డిజిటల్ గా ఫోటోషాప్ లాంటి సాఫ్ట్వేరు సహాయంతో రూపొందించబడింది. 

స్క్రీన్ షాట్ లోని ట్వీట్ లో ఉన్న ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఆ ఫోటో ని ‘20 అక్టోబర్ 2015’ న బీజింగ్ లో జరిగిన ‘ఆసియా రాజకీయ పార్టీల అంతర్జాతీయ సమావేశం’ లో సీతారాం ఏచూరి పాల్గొన్న సమయం లో జిన్‌పింగ్‌ను కలిసినది. 

చివరగా, 2015 లో సీతారాం ఏచూరి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను తన ‘బాస్’ గా పేర్కొంటూ ట్వీట్ చేయలేదు. స్క్రీన్ షాట్ లోని ట్వీట్ ఫోటోషాప్ చేసినది.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll