సిపిఐ (ఎం) నాయకులు బ్రిందా కారత్ మరియు సీతారాం ఏచూరీ లు ప్లకార్డులతో ఉన్న ఫోటోలను ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ ప్లకార్డుల మీద ‘ఇండియన్ ఆర్మీ డౌన్ డౌన్… వీ సపోర్ట్ టు చైనా జిందాబాద్’ అని ఉంటుంది. ఆ ఫోటోలు నిజమో కాదో చూద్దాం.
క్లెయిమ్: సిపిఐ (ఎం) నాయకులు ఇండియన్ ఆర్మీ కి వ్యతిరేకంగా, చైనాకు మద్దతుగా నిరసన తెలుపుతున్న ఫోటోలు.
ఫాక్ట్ (నిజం): ): పోస్ట్ చేసిన ఫోటోలు ఫోటోషాప్ చేసినవి. బ్రిందా కారత్ పట్టుకున్న ప్లకార్డు మీద ‘ప్రతీపేద వ్యక్తికి ఆరు నెలల పాటు ఉచితంగా 10 కిలోల ఆహార ధాన్యాలు ఇవ్వాలి’ అని ఉంటుంది. సీతారాం ఏచూరీ పట్టుకున్న ప్లకార్డు మీద ‘ఆదాయపు పన్ను పరిధికి వెలుపల ఉన్న అన్ని కుటుంబాలకు 6 నెలల పాటూ నెలకు 7500 రూపాయలు తక్షణమే నగదు బదిలీ చేయాలి’ అని ఉంటుంది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
సిపిఐ (ఎం) అధికారిక ట్విట్టర్ ఖాతా లో పోస్టులోని ఫోటోల యొక్క వాస్తవ ఫోటోలను చూడవచ్చు. ఆ ఫోటోలు ఇటీవల సిపిఐ(ఎం) పార్టీ వారు న్యూ ఢిల్లీ లో చేసిన నిరసన కి సంబంధించినవి.
ఫోటో-1:
బ్రిందా కారత్ పట్టుకున్న ప్లకార్డు మీద ‘ప్రతీపేద వ్యక్తికి ఆరు నెలల పాటు ఉచితంగా 10 కిలోల ఆహార ధాన్యాలు ఇవ్వాలి’ అనే అర్ధం వచ్చేలా ఇంగ్లిష్ లో మరియు హిందీ లో రాసి ఉంటుంది.
ఫోటో-2:
సీతారాం ఏచూరీ పట్టుకున్న ప్లకార్డు మీద ‘ఆదాయపు పన్ను పరిధికి వెలుపల ఉన్న అన్ని కుటుంబాలకు 6 నెలల పాటూ నెలకు 7500 రూపాయలు తక్షణమే నగదు బదిలీచేయాలి’ అనే అర్ధం వచ్చేలా ఇంగ్లిష్ లో మరియు హిందీ లో రాసి ఉంటుంది.
సిపిఐ (ఎం) పార్టీ వారు న్యూ ఢిల్లీ లో ‘16 జూన్ 2020’ న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిరసన చేశారు. ఆ నిరసన ప్రదర్శనకి సంబంధించిన మరిన్ని ఫోటోలను సీతారాం ఏచూరి అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో కూడా చూడవచ్చు. ఆ నిరసన కి సంబంధించిన న్యూస్ వీడియో ని ఇక్కడ చూడవచ్చు.
చివరగా, సిపిఐ (ఎం) నాయకులు ‘ఇండియన్ ఆర్మీ డౌన్ డౌన్… వీ సపోర్ట్ టు చైనా జిందాబాద్’ అనే ప్లకార్డులతో ఉన్న ఫోటోలు ఫోటోషాప్ చేసినవి.
‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?