Fake News, Telugu
 

‘నెహ్రూతో ఎన్టీఆర్ అరుదైన ఫోటో’ అని పెట్టిన ఫోటో ఫోటోషాప్ చేసినది

0

నెహ్రూ తో ఎన్టీఆర్ కనిపించేఫోటో ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ ఫోటో ఎంతవరకు వాస్తవమో పరిశీలిద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: నెహ్రూతో ఎన్టీఆర్ ఫోటో.

ఫాక్ట్ (నిజం): నెహ్రూ తో ఎన్టీఆర్ కనిపించే ఆ ఫోటో ఫోటోషాప్ చేసినది. వాస్తవ ఫోటోలో నెహ్రూతో మహాత్మా గాంధీ ఉంటారు. కావున, పోస్టులో చెప్పింది తప్పు. 

పోస్టులోని ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ‘Getty Images’ యొక్క లింక్ సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చింది. ఆ లింక్ లోని ఫోటో ని చూసినప్పుడు, అందులో నెహ్రూతో మహాత్మా గాంధీ ఉన్నారు. కావున, నెహ్రూ తో ఎన్టీఆర్ కనిపించే ఆ ఇమేజ్ ఫోటోషాప్ చేసినది.

చివరగా, నెహ్రూ తో ఎన్టీఆర్ కనిపించే ఆ ఇమేజ్ ఫోటోషాప్ చేసినది. 

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll