Fake News, Telugu
 

73 లక్షల రుపాయలను కేటాయించింది తాడేపల్లి లోని ముఖ్యమంత్రి జగన్ క్యాంపు ఆఫీస్ మరియు నివాసం యొక్క తలుపులు/కిటికీలు మరియు ఇతర పనుల కోసం.

0

ఆంధ్రప్రదేశ్ ముఖమంత్రి జగన్ మోహన్ రెడ్డి యొక్క ఇంటి కిటికీల కొరకు 73 లక్షల రూపాయలను కేటాయిస్తూ ఒక జీఓ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిందని చెప్తూ ఒక జీఓ ఫోటోని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: జగన్ ఇంటి కిటికీలకు 73 లక్షల రూపాయలను జారీ చేసిన ఏపీ ప్రభుత్వం.

ఫాక్ట్ (నిజం): తాడేపల్లి లో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీస్ మరియు నివాసానికి తలుపులు/కిటికీలు మరియు ఇతర పనుల కోసం ఏపీ ప్రభుత్వం 73 లక్షల రూపాయలను జారీ చేసింది. కావున పోస్ట్ లో జగన్ ఇంటి కిటికీల కోసం అని చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

పోస్ట్ చేసిన జీఓ ఫోటోలో జీఓ నెంబర్ (‘259’) మరియు తేదీ (15-10-2019) చూడవొచ్చు. ఆ వివరాలతో ఆంధ్రప్రదేశ్ జీఓల రిజిస్టర్ వెబ్ సైట్ లో వెతకగా, పోస్ట్ లో ఉన్న జీఓ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిజంగానే జారీ చేసినట్టు తెలుస్తుంది.

కానీ, జీఓ ని సరిగ్గా చదివితే, ప్రభుత్వం 73 లక్షల రుపాయలను కేటాయించింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉండటానికి తాడేపల్లి లో ఏర్పాటు చేసిన క్యాంపు ఆఫీస్ మరియు నివాసం యొక్క తలుపులు/కిటికీలు మరియు ఇతర పనుల కోసం అని తెలుస్తుంది. పోస్ట్ లో జగన్ ఇంటి కిటికీల కోసం అని చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

చివరగా, 73 లక్షల రుపాయలను కేటాయించింది తాడేపల్లి లోని ముఖ్యమంత్రి జగన్ క్యాంపు ఆఫీస్ మరియు నివాసం యొక్క తలుపులు/కిటికీలు మరియు ఇతర వాటి కోసం.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll