లాక్ డౌన్ కారణంగా వందల కిలోమీటర్లు నడిచి వెళ్తూ, కన్నీరు పెట్టుకుంటున్న చిన్నారి అని ఒక పాప ఫోటోని కొంత మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ‘నెత్తి మీద మూటతో నడవలేకపోతున్నా’ అని తను చెప్పినట్టు ఒక కథ కూడా పోస్టులో పెట్టారు. అయితే, అది ఒక పాత ఫోటో అని FACTLY విశ్లేషణలో తేలింది. అంతేకాదు, అది అసలు భారతదేశానికి సంబంధించిన ఫోటో కూడా కాదు. అది 2017 లో బంగ్లాదేశ్ లో తీసిన ఫోటో. లాక్ డౌన్ కారణంగా తమ ఊర్లకు వెళ్ళడానికి ప్రజలు కష్టాలు పడుతున్నారు అనేది వాస్తవం, కానీ పోస్టులోని ఫోటో మాత్రం పాతది
సోర్సెస్:
క్లెయిమ్ – ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్ –
‘Getty Images’ వెబ్ సైట్ – https://www.gettyimages.in/detail/news-photo/rohingya-girl-cries-as-refugees-fleeing-from-myanmar-cross-news-photo/862001952
Did you watch our new video?