Fake News, Telugu
 

వివిధ వార్తాసంస్థల లోగోలు పెట్టి, GHMC ఎన్నికలకు సంబంధించి బీజేపీ పై ఫేక్ వార్తలు షేర్ చేస్తున్నారు

0

GHMC ఎన్నికల సందర్భంగా కొన్ని వార్తల స్క్రీన్ షాట్స్ ని సోషల్ మీడియాలో చాలా మంది షేర్ చేస్తున్నారు. GHMC ఎన్నికల ప్రచారం నుండి బండి సంజయ్ ను బీజేపీ తీసేసిందని ‘V6 న్యూస్’ ప్రసారం చేసినట్టు కొన్ని స్క్రీన్ షాట్స్ తో కొందరు షేర్ చేస్తే, GHMC ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ లో గొడవలు సృష్టించడానికి తెలంగాణ బీజేపీ ఐటీ సెల్ 60 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధమైందని ‘టైమ్స్ నౌ’ ఆర్టికల్ ప్రచురించినట్టు మరికొందరు ఒక ఫోటోని షేర్ చేసారు. ఆ పోస్టుల్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

పోస్ట్ 1:

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: GHMC ఎన్నికల ప్రచారం నుండి బండి సంజయ్ ను బీజేపీ తీసేసిందని ప్రసారం చేసిన ‘V6 న్యూస్’ యొక్క స్క్రీన్ షాట్స్.

ఫాక్ట్: తాము అలాంటి వార్త అసలు ప్రసారం చేయలేదని, పోస్ట్ లోని స్క్రీన్ షాట్స్ ఎడిట్ చేసినవని ‘V6 న్యూస్’ వారు వివరణ ఇచ్చారు. ‘V6 న్యూస్’ లోగో ఉపయోగిస్తూ, సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారం పై ‘V6 న్యూస్’ సంస్థ వారు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసారు. అంతేకాదు, అది ఒక ఫేక్ న్యూస్ అని ‘బీజేపీ తెలంగాణ’ వారు కూడా ట్వీట్ చేసారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని వార్త గురించి ఇంటర్నెట్ లో వెతకగా, తమ పేరుతో ప్రచారం అవుతున్న స్క్రీన్ షాట్స్ పై ‘V6 న్యూస్’ సంస్థ వివరణ ఇచ్చినట్టు తెలిసింది. తాము అలాంటి వార్త అసలు ప్రసారం చేయలేదని, పోస్ట్ లోని స్క్రీన్ షాట్స్ ఎడిట్ చేసినవని ‘V6 న్యూస్’ వారు వివరణ ఇచ్చారు. ‘V6 న్యూస్’ లోగో ఉపయోగిస్తూ, సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ తప్పుడు ప్రచారం పై ‘V6 న్యూస్’ సంస్థ వారు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేసారు.

అంతేకాదు, అది ఒక ఫేక్ న్యూస్ అని ‘బీజేపీ తెలంగాణ’ వారు కూడా ట్వీట్ చేసారు. కావున, సోషల్ మీడియాలో ‘V6 న్యూస్’ లోగో తో షేర్ అవుతున్నవి ఫేక్ స్క్రీన్ షాట్స్.

పోస్ట్ 2:

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: GHMC ఎన్నికల్లో గొడవలు సృష్టించడానికి 60 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్న తెలంగాణ బీజేపీ ఐటీ సెల్ అని ప్రచురించిన ‘టైమ్స్ నౌ’ ఆర్టికల్ యొక్క స్క్రీన్ షాట్.

ఫాక్ట్: ఫోటోలోని వార్తను ‘టైమ్స్ నౌ’ సంస్థ ప్రచురించలేదు. అంతేకాదు, ‘టైమ్స్ నౌ’ వెబ్సైటులోని వార్తల టెంప్లేట్ మరియు ఫోటోలోని వార్త టెంప్లేట్ వేరేలా ఉన్నట్టు చూడవొచ్చు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లోని వార్త గురించి ‘టైమ్స్ నౌ’ వెబ్సైటులో వెతకగా, ఆ వార్తను ‘టైమ్స్ నౌ’ సంస్థ ప్రచురించలేదని తెలుస్తుంది. వారి వెబ్సైటులో ఫోటోలోని ఆర్టికల్ టైటిల్ తో వెతకగా, సెర్చ్ రిజల్ట్స్ లో ఆర్టికల్ రాలేదు. ఆ వార్తను వేరే ప్రముఖ వార్తాసంస్థలు ప్రచురించినట్టు కూడా ఎక్కడా సమాచారం దొరకలేదు.

అంతేకాదు, ‘టైమ్స్ నౌ’ వెబ్సైటులోని వార్తల టెంప్లేట్ మరియు ఫోటోలోని వార్త టెంప్లేట్ వేరేలా ఉన్నట్టు చూడవొచ్చు. ఫోటోలోని ఆర్టికల్ లో స్పెల్లింగ్ తప్పు (‘qouted’) కూడా ఉన్నట్టు చూడవొచ్చు. కావున, పోస్ట్ లో ఉన్నది ఫేక్ స్క్రీన్ షాట్.

చివరగా, వివిధ వార్తాసంస్థల లోగోలు పెట్టి, GHMC ఎన్నికలకు సంబంధించి బీజేపీ పై ఫేక్ వార్తలు షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll