Fake News, Telugu
 

పాక్ పై భారత్ ఆర్మీ చేసిన దాడి కాదు, మహారాష్ట్ర లో జూన్ నెలలో నిర్వహించిన ఫైరింగ్ అభ్యాసం

1

‘పాకిస్తాన్ పై విరుచుకుపడుతున్న భారతీయ బాంబులు’ అని చెప్తూ ఒక వీడియోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పాకిస్తాన్ పై భారత్ ఆర్మీ దాడి చేస్తున్న వీడియో. 

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని వీడియో జూన్ నెలలో ‘Deolali firing range’ లో భారత్ ఆర్మీ నిర్వహించిన ఫైరింగ్ అభ్యాసానికి సంబంధించినది. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.  

పోస్ట్ లోని వీడియో యొక్క స్క్రీన్ షాట్స్ ని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, పోస్ట్ లోని వీడియో లాంటి చాలా యూట్యూబ్ వీడియోలు సెర్చ్ రిజల్ట్స్ లో వస్తాయి. ఒక యూట్యూబ్ వీడియో యొక్క టైటిల్ – ‘Indian Army Firing Exercise (BM-21) at the Deolali ranges -| 2019’ అని ఉంటుంది. ఆ కీ-వర్డ్స్ తో గూగుల్ లో వెతకగా, అదే వీడియోని ‘Times of India’ వారు కూడా జూన్-2019 లో పెట్టినట్టుగా చూడవొచ్చు. ఆ వీడియో వివరణలో ‘The Indian Army fired back to back BM-21 Grad missiles during a firing exercise in Maharashtra’s Deolali అని రాసి ఉన్నట్టుగా చూడవొచ్చు. కావున, ఆ వీడియోకి పాకిస్తాన్ కి అసలు సంబంధం లేదు.

చివరగా, పాక్ పై భారత్ ఆర్మీ చేసిన దాడి కాదు, మహారాష్ట్ర లో జూన్ నెలలో నిర్వహించిన ఫైరింగ్ అభ్యాసం.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

scroll