Fake News, Telugu
 

ఖలీద్ మెహమూద్ అబ్బాసీ భారతదేశాన్ని బెదిరించే ప్రకటన చేయలేదు.

0

పాకిస్థాన్ ఇస్లామిక్ మత బోధకుడు ఖలీద్ మెహమూద్ అబ్బాసీ చేసిన ప్రకటన అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ అవుతోంది. ఇజ్రాయెల్‌కు హమాస్ చేసినట్టే భారత్ లోని హిందువులకు పాకిస్థాన్ చేస్తుందని ఆయన చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కథనం ద్వారా ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: పాకిస్తాన్ ఇస్లామిక్ మత బోధకుడు ఖలీద్ మెహమూద్ అబ్బాసీ ఇజ్రాయెల్‌కు హమాస్ చేసినట్టే భారత్ లోని హిందువులకు పాకిస్థాన్ చేస్తుందని భారతదేశానికి బెదిరింపు వ్యాఖ్యలు చేశాడు.

ఫాక్ట్ (నిజం): ఖలీద్ మెహమూద్ అబ్బాసీ ఈ  వ్యాఖ్యలు చేసినట్టు ఎక్కడా రిపోర్ట్ కాలేదు. అతను అలాంటి ప్రకటనలు చెయ్యలేదని కూడా X లో పోస్టు చేసాడు. కాబట్టి, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.

ఈ క్లెయిమ్ యొక్క వాస్తవికతను తెలుసుకోవటానికి, ఏ మీడియా సంస్థ ఖలీద్ అలాంటి ప్రకటనలు చేసినట్లు రిపోర్ట్ చేసిందో తెలుసుకోవడానికి  ఇంటర్నెట్‌లో కీవర్డ్ సెర్చ్ చేస్తే, ఈ క్లెయిమ్సం కి సంబంధించి ఎటువంటి సమాచారం లభించలేదు. సాధారణంగా, జాతీయ భద్రతకు ముప్పు కలిగించే ఏ ప్రకటన అయినా అన్ని ప్రముఖ మీడియా సంస్థలు సాధారణంగా రిపోర్ట్ చేస్తాయి. ఈ సందర్భంలో అది జరగలేదు.


తదుపరి, ఖలీద్ మెహమూద్ అబ్బాసీ యొక్క యూట్యూబ్ ఛానెల్ మరియు ఫేస్‌బుక్ ప్రొఫైళ్లు పరిశీలించగా,  7 అక్టోబర్ 2023 న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి తర్వాత అతను అలాంటి ప్రకటనలు చేయలేదని తేలింది (ఇక్కడ). అంతే కాకుండా, ఖలీద్ మెహమూద్ ట్విట్టర్లో, అతను అలాంటి ప్రకటనలు చేయలేదని సూచిస్తూ సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు చేసిన ఒక పోస్టును రీట్వీట్ చేసాడు.

చివరిగా, ఖలీద్ మెహమూద్ అబ్బాసీ భారతదేశాన్ని బెదిరించే ప్రకటనలు చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll