‘Times Now’ వార్తా సంస్థ యొక్క ఒక న్యూస్ వీడియో ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ వీడియో లో న్యూస్ రిపోర్టర్ కొన్ని గణాంకాలతో ఉన్న ఒక పేపర్ (రేట్ కార్ద్ పాంప్లెట్) ని ఆధారంగా చూపిస్తూ, హిందూ యువతులను మతమార్పిడి చేపిస్తే ఏజెంట్స్ కి ప్రోత్సాహకంగా ISIS డబ్బులు ఇస్తోందని తెలుపుతాడు మరియు ఇలాంటి ఘటనలు గాజా స్ట్రీట్ (కేరళ) లోని కోచింగ్ సెంటర్ లలో మరియు ట్యూషన్ సెంటర్ లలో జరుగుతున్నట్లుగా కూడా చెపుతాడు. అందులో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్దాం.
క్లెయిమ్: కేరళలో హిందూ అమ్మాయిలను ISIS అమ్మకంకి పెట్టింది. అమ్మాయి యొక్క కులం బట్టి రేటు ఫిక్స్ చేసారు.
ఫాక్ట్ (నిజం): హిందూ యువతులను మతమార్పిడి చేపిస్తే ఏజెంట్స్ కి ప్రోత్సాహకంగా ISIS డబ్బులు ఇస్తోందని అని న్యూస్ రిపోర్టర్ ఆధారంగా చూపించిన రేట్ కార్ద్ పాంప్లెట్ ఫోటోషాప్ చేయబడినది. కావున, పోస్టులో చెప్పినది తప్పు.
పోస్టులో ‘కేరళలో ISIS హిందూ అమ్మాయిలను అమ్మకానికి పెట్టింది. అమ్మాయి యొక్క కులం బట్టి రేటు ఫిక్స్ చేసారు’ అని చెప్పారు. కానీ, న్యూస్ రిపోర్టర్ ఒక రేట్ కార్ద్ పాంప్లెట్ ని ఆధారంగా చూపిస్తూ, హిందూ యువతులను మతమార్పిడి చేపిస్తే ఏజెంట్స్ కి ప్రోత్సాహకంగా ISIS డబ్బులు ఇస్తోందని తెలుపుతాడు.
గూగుల్ లో ‘Rate card kerala gaza street Times Now’ వెతికినప్పుడు, ‘Alt News’ వారు ఇంతకుముందే ఆ వీడియోలో చెప్పింది తప్పు అని తెలుపుతూ రాసిన ఫాక్ట్ చెక్ ఆర్టికల్ లభించింది. ఆ ఆర్టికల్ ప్రకారం, ఆ పాంప్లెట్ లో ఉన్న కథ యొక్క మొట్టమొదటి వెర్షన్ ‘Sikhs and Islam’ అనే బ్లాగ్ లో ఫిబ్రవరి 5, 2010వ తేదీన పబ్లిష్ చేశారు.ఆ వీడియోలో కనిపించే రేట్ కార్డ్ పాంప్లెట్ ఫోటోషాప్ చేయబడినదనీ, అందులో వ్యాకరణపరమైన తప్పులు కూడా చాలా ఉన్నాయని ఆ ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది.
చివరగా, ఒక ఫేక్ రేట్ కార్డు పాంప్లెట్ ఆధారముగా ‘Times Now’ రెండు సంవత్సరాల క్రితం ప్రసారం చేసిన కథనాన్ని ఇప్పుడు మళ్లీ షేర్ చేస్తున్నారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?
1 Comment
Pingback: ఒక ఫేక్ రేట్ కార్డ్ కరపత్రం ఆధారంగా ‘Times Now’ రెండు సంవత్సరాల క్రితం ప్రసారం చేసిన కథనాన్ని ఇప్పు