Fake News, Telugu
 

ఖజకిస్తాన్ గేమర్ ఫోటోని ఇరాన్ కమాండర్ ఖాసిమ్ సులేమాని ని హతమార్చిన అమెరికన్ లేడి ఆఫీసర్ అని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

బాగ్దాద్ విమానాశ్రయం సమీపంలో ఇరాన్ టాప్ కమాండర్ ఖాసిమ్ సులేమానిని డ్రోన్ ల సహాయంతో హతమార్చిన అమెరికన్ యంగ్ లేడి ఆఫీసర్ మేరీ వెర్మాంట్ ఫోటో, అని క్లెయిమ్ చేస్తూ సోషల్ మీడియాలో కొందరు పోస్ట్ చేస్తున్నారు. ‘03 జనవరి 2020’ నాడు ఇరాన్ టాప్ కమాండర్ ఖాసిమ్ సులమాని ని అమెరికన్ ఆర్మీ డ్రోన్ ల సహాయంతో హతమార్చింది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇరాన్ టాప్ కమాండర్ ఖాసిమ్ సులేమాని ని డ్రోన్ సహాయంతో హతమార్చిన అమెరికన్ ఆఫీసర్ మేరీ వెర్మాంట్ ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటోలో కనిపిస్తున్నది ఖజకిస్తాన్ కి చెందిన ఎయిర్ సాఫ్ట్ గేమర్ యులియా చబనోవ, అమెరికన్ లేడి ఆఫీసర్ కాదు. ఇరాన్ టాప్ కమాండర్ ఖాసిమ్ సులేమాని ని మేరి వెర్మాంట్ అనే అమెరికన్ లేడి ఆఫీసర్ హతమార్చినట్టు ఎక్కడ రిపోర్ట్ చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇదే ఫోటోని రష్యన్ సోషల్ మీడియా వెబ్సైట్  ‘VK.com’ లో పోస్ట్ చేసినట్టు తెలిసింది. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఖజకిస్తాన్ ఎయిర్ సాఫ్ట్ గేమర్ యులియా చబనోవ, అని ఫోటో వివరణలో తెలిపారు. ఖజకిస్తాన్ దేశంలోని కోస్తానాయ్ నగరానికి చెందిన యులియా చబనోవ, 2017 నుంచి ఎయిర్ సాఫ్ట్ గేమ్ ని ఆడుతునట్టు ఈ పోస్టులో తెలిపారు. యులియా చబనోవ, తను ధరించే మిలిటరీ బట్టల వివరాలు తెలుపుతూ తన ‘White Fox Airsoft’ యూట్యూబ్ ఛానెల్ లో వీడియోలు అప్లోడ్ చేసింది. అంతేకాదు, తను మిలిటరీ బట్టలలో దిగిన మరికొన్న ఫోటోలని యులియా చబనోవ, తన ఇంస్టాగ్రామ్ పేజిలో పోస్ట్ చేసింది. వాటిని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

ఇరాన్ మిలిటరీ కమాండర్ ఖాసిమ్ సులేమాని మరణానికి సంబంధించిన వివరాల కోసం వెతకగా, BBC న్యూస్ వెబ్ సైట్ ఖాసిమ్ సులేమాని మరణానికి సంబంధించి ‘03 జనవరి 2020’ నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్ దొరికింది. ‘03 జనవరి 2020’ నాడు బాగ్దాద్ విమానాశ్రయం సమీపంలో సులేమాని కాన్వోయ్ పై అమెరికన్ ఆర్మీ  డ్రోన్ మిస్సైల్స్ తో దాడి చేసినట్టు ఈ ఆర్టికల్ లో తెలిపారు. ఈ దాడిలో సులేమని మరణించినట్టు అందులో తెలిపారు. అమెరికన్ ఆర్మీ MQ-9 రీపర్  డ్రోన్ సహాయంతో ఖాసిమ్ సులేమాని ని హతమార్చినట్టు ‘The New York Times’, తమ ఆర్టికల్ లో రిపోర్ట్ చేసింది.

ఖాసిమ్ సులేమాని హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుపుతూ ‘Al Jazeera’ న్యూస్ వెబ్ సైట్ తమ యూట్యూబ్ ఛానెల్లో ఒక వీడియోని అప్లోడ్ చేసింది. సులెమాని ని హత్య చేసింది మేరీ వెర్మాంట్ అనే అమెరికన్ లేడీ ఆఫీసర్ అని ఎక్కడ రిపోర్ట్ చేయలేదు. దీనిబట్టి, ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయికి ఖాసిమ్ సులెమాని హత్యకు ఎటువంటి సంబంధం లేదని ఈ వివరాల ఆధారంగా ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, ఖజకిస్తాన్ ఎయిర్ సాఫ్ట్ గేమర్ ఫోటోని షేర్ చేస్తూ ఇరాన్ టాప్ కమాండర్ ఖాసిమ్ సులేమాని ని హతమార్చిన అమెరికన్ లేడి ఆఫీసర్ అంటున్నారు .

Share.

About Author

Comments are closed.

scroll