Fake News, Telugu
 

కాన్పూర్ పోలీసులు మాస్క్ ధరించని కారణంగా మేకని అరెస్ట్ చేయలేదు.

0

కాన్పూర్ పోలీసులు మాస్క్ ధరించని కారణంగా ఒక మేకని అరెస్ట్ చేసారు అని చెప్పే పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో చాల వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: కాన్పూర్ పోలీసులు మాస్క్ ధరించని కారణంగా ఒక మేకని అరెస్ట్ చేసారు.

ఫాక్ట్ (నిజం): కాన్పూర్ పోలీస్ వారి ట్వీట్ ప్రకారం ఒంటరిగా తిరుగుతున్న మేకని పోలీస్ స్టేషన్ కి తరలించి తరువాత దాని యజమానికి అప్పగించడం జరింగింది. ఐతే అన్వర్ గంజ్ పోలీస్ స్టేషన్ కి చెందిన సర్కిల్ ఆఫీసర్ సైఫుద్దీన్ బేగ్ చెప్పిన దాని ప్రకారం ఆ మేకతో ఉన్న వ్యక్తి మాస్క్ ధరించని కారణంగా తమని చూసి మేకని అక్కడే వదిలేసి పారిపోయాడు. అప్పుడు వారు ఆ మేకని పోలీస్ స్టేషన్ కి తరలించారు. పోలీస్ వారు చేప్తున్న రెండు వివరణలకి వ్యత్యాసమున్నప్పటికి మేక మాత్రం మాస్క్ ధరించనందుకు అరెస్ట్ కాలేదు. కావున పోస్ట్ ద్వారా చెప్తున్నది తప్పు.

ఈ వార్త గురించి మరింత సమాచారం కొరకి గూగుల్ లో వెతకగా కాన్పూర్ పోలీస్ వారు ఈ వార్త గురించి వివరణ ఇస్తూ చేసిన ట్వీట్ మాకు కనిపించింది. ఆ ట్వీట్ ప్రకారం లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో దాదా మియాన్ ఇంటర్ సెక్షన్ దగ్గర ఒక మేక  తిరుగుతుంటే దానిని బేకన్ గంజ్ పోలీస్ స్టేషన్ కి  తీసుకువచ్చామని, తరవాత దాని యజమానికి అందిచామని తెలిపారు.

అన్వర్ గంజ్ పోలీస్ స్టేషన్ కి చెందిన సర్కిల్ ఆఫీసర్ సైఫుద్దీన్ బేగ్ చెప్పిన దాని ప్రకారం ఆ మేక తో ఉన్న వ్యక్తి మాస్క్ ధరించని కారణంగా తమని చూసి మేకని అక్కడే వదిలేసి పారిపోయాడు. ఐతే ఈ వాదన కాన్పూర్ పోలీస్ వారి ట్వీట్ కి పూర్తి భిన్నంగా ఉంది. ఇదే విషయాన్ని కొన్ని న్యూస్ పోర్టల్స్ ప్రచురించాయి వాటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

ఐతే మేము అన్వర్ గంజ్ పోలీస్ స్టేషన్ కి చెందిన సర్కిల్ ఆఫీసర్ సైఫుద్దీన్ బేగ్ ని ఫోన్ ద్వారా సంప్రదించినప్పుడు, “తమని చూసి మేకతో ఉన్న వ్యక్తి తనకి మాస్క్ లేని కారణంగా మేకని అక్కడే వదిలేసి పారిపోయాడు. అప్పుడు మేము ఆ మేకని పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చాము. తరువాత ఆ మేకని దాని యజమానికి అప్పగించాము. పైగా అతనికి మాస్క్ ధరించని కారణంగా ఫైన్ కూడా విధించాము. మాస్క్ ధరించని కారణంగా మేకని అరెస్ట్ చేసాం అన్న వాదన హాస్యాస్పదంగా ఉంది. IPC మరియు CrPC చట్టాల కింద జంతువులని అరెస్ట్ చేయలేము” అని తెలిపారు.

చివరగా, కాన్పూర్ పోలీసులు మాస్క్ లేని కారణంగా మేకని అరెస్ట్ చేయలేదు

Share.

About Author

Comments are closed.

scroll