Coronavirus, Coronavirus Telugu, Fake News, Telugu
 

జాయ్ అరక్కల్ UAE కేంద్రంగా పని చేసే ‘ఇన్నోవా గ్రూప్ అఫ్ కంపెనీస్’ కి మ్యానేజింగ్ డైరెక్టర్. ఆయన ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.

0

‘బంగారు మరియు వజ్రాల వ్యాపార సంస్థ ‘జోయాలుక్కాస్’ అధినేత ‘జాయ్ అరక్కల్’ కొరోనా వైరస్ తో మిడిల్ ఈస్ట్ లో చనిపోయారు. అతని పార్థవ దేహాన్ని కుడా భారత్ కి తరలించే పరిస్థితి కూడా లేదు’ అని చెప్తూ  చాలా మంది ఫేస్బుక్ లో పోస్టు చేస్తున్నారు. కానీ, ‘జోయాలుక్కాస్’ సంస్థ కి అధినేత ‘జాయ్ అలుక్కాస్’; ‘జాయ్ అరక్కల్’ కాదు. జాయ్ అరక్కల్ UAE కేంద్రంగా పని చేసే ‘ఇన్నోవా గ్రూప్ అఫ్ కంపెనీస్’ కి మ్యానేజింగ్ డైరెక్టర్. ఆయన దుబాయ్ లో 23 ఏప్రిల్ 2020 న మరణించాడు. మొదట ఆయన గుండె జబ్బు తో మరణింఛి ఉంటాడనే వార్తలు వచ్చాయి, కానీ ఇటివలే దుబాయ్ పోలీసులు జాయ్ అరక్కల్ ఆర్ధిక కారణాలతో ఒక బిల్డింగ్ 14వ అంతస్తు నుండి దూకి సూసైడ్ చేసుకున్నట్లుగా నిర్ధారించారు. ‘జోయాలుక్కాస్’ వారు ఒక ఫేస్బుక్ పోస్టు లో జాయ్ అలుక్కాస్ (ఆ సంస్థ అధినేత) కి సంబంధించి తప్పుడు వార్తలు వస్తున్నాయని, ఆయన సురక్షితంగా మరియు ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టం చేసారు. అంతేకాదు, చనిపొయిన ‘జాయ్ అరక్కల్’ కి తమ సంస్థ తో ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. 

సోర్సెస్:
క్లెయిమ్: ఫేస్బుక్ పోస్ట్ (ఆర్కైవ్డ్)
ఫాక్ట్:
1. ‘జాయ్ అలుక్కాస్’ సంస్థ వెబ్సైటు – https://www.joyalukkas.in/pages/about-us—joyalukkas-group/pgid-1248870.aspx
2. ‘జాయ్ అలుక్కాస్’ సంస్థ ఫేస్బుక్ పోస్ట్ – https://www.facebook.com/JoyalukkasIndia/photos/a.210843252264680/3490826100933029/?type=3&theater
3. న్యూస్ ఆర్టికల్ – https://gulfnews.com/uae/death-of-keralite-industrialist-in-uae-a-case-of-suicide-confirms-dubai-police-1.71238447

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll