Fake News, Telugu
 

కొల్లాపుర్‌లో ఇటీవల జరిగిన కాంగ్రెస్ సభకు సంబంధించిన వీడియోలో “జై కేసీఆర్” అనే నినాదాలు డిజిటల్‌గా జోడించబడ్డాయి

0

పాలమూరులో జరిగిన కాంగ్రెస్ సభలో రేవంత్  రెడ్డి మాట్లాడుతుండగా “జై కేసీఆర్” అని  ప్రజలు నినాదాలు చేసారు అంటూ ఒక వీడియోను  సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీని వెనుక ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: పాలమూరులో జరిగిన కాంగ్రెస్ సభలో, ప్రజలు “జై కేసీఆర్” అంటూ నినాదాలు పలికిన వీడియో.

ఫాక్ట్: ఈ వీడియో ఇటీవల కొల్లాపుర్‌లో జరిగిన కాంగ్రెస్ సభ యొక్క వీడియో. కేసీఆర్ అనుకూల నినాదాలను డిజిటల్ మార్ఫింగ్ చేసి వైరల్ వీడియోకు చేర్చారు. కావున, ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

ఈ వీడియోను యొక్క కీ ఫ్రేములను ఉపయోగించి  రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఈ సభ యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని పలు యూట్యూబ్ ఛానళ్లలో ప్రచురించడం గమనించాం (ఇక్కడ మరియు ఇక్కడ ). ఈ సభ 31 అక్టోబర్ 2023న కొల్లాపుర్‌లో జరిగింది.

వైరల్ అవుతున్న వీడియోను పలు టైంస్టాంప్స్ మధ్య కాప్చర్ చేయబడింది అని, ప్రత్యక్ష ప్రసారాలలో “జై కేసీఆర్” అనే  నినాదాలు లేవని మేము గుర్తించాము. దీని ద్వారా, కేసీఆర్ అనుకూల నినాదాలను డిజిటల్ మార్ఫింగ్ చేసి వైరల్ వీడియోకు చేర్చారు అని స్పష్టమైంది.

చివరిగా, కొల్లపుర్‌లో ఇటీవల జరిగిన కాంగ్రెస్ సభకు సంబంధించిన వీడియోలో “జై కేసీఆర్” అనే నినాదాలు డిజిటల్‌గా జోడించబడ్డాయి.

Share.

About Author

Comments are closed.

scroll