Fake News, Telugu
 

భారత జాతీయ భద్రతను ఉద్దేశించి గానీ, నరేంద్ర మోదీపై హిందువుల వ్యతిరేకత గురించి గాని జాక్ మా వ్యాఖ్యలు చేయలేదు

0

“మీరు కోతి ముందు అరటిపండ్లు మరియు చాలా డబ్బు పెడితే, కోతి అరటిపండ్లను మాత్రమే తీసుకుంటుంది, డబ్బును కాదు. ఎందుకంటే డబ్బుతో చాలా అరటిపండ్లు కొనవచ్చని వాటికి తెలియదు. అదే విధంగా, ఈ రోజు భారతదేశ ప్రజలను జాతీయ భద్రత మరియు వ్యక్తిగత ప్రయోజనాలలో ఒకటి ఎంచుకోవాలని కోరితే, వారు తమ వ్యక్తిగత ప్రయోజనాలను మాత్రమే ఎంచుకుంటారు. దేశం సురక్షితంగా ఉండాలని వారు అర్థం చేసుకోలేరు. దేశమే సురక్షితంగా లేనప్పుడు మీరు మీ వ్యక్తిగత ప్రయోజనాల మూటను ఎక్కడికి తీసుకెళతారు?”, అని ఆలీబాబా సంస్థ కో-ఫౌండర్ జాక్ మా భారత దేశాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినట్టు ఒక పోస్టు సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. “నరేంద్ర మోదీని వ్యతిరేకిస్తున్న లక్షలాది హిందువులను చూశాం. కాని, ఒవైసీని వ్యతిరేకించే ఒక ముస్లింనైనా చూసారా? మోదీ పతనానికి హిందువులే కారణమవుతారు”, అని ఈ పోస్టులో తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఇంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: భారత జాతీయ భద్రత మరియు భారత దేశ ప్రజల వ్యక్తిగత ప్రయోజనలను ఉద్దేశించి జాక్ మా చేసిన వ్యాఖ్యలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో తెలుపుతున్న వ్యాఖ్యలను ఆలీబాబా సంస్థ కో-ఫౌండర్ జాక్ మా చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. భారత దేశ జాతీయ భధ్రతను ఉద్దేశించి గానీ, నరేంద్ర మోదీపై హిందువుల వ్యతిరేకతను ఉద్దేశించి గాని జాక్ మా ఇటీవల ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం ఇంటర్నెట్లో వెతికితే,  భారత దేశ జాతీయ భధ్రతను ఉద్దేశించి గానీ, భారత ప్రజల వ్యక్తిగత ప్రయోజనాలను ఉద్దేశించి గానీ జాక్ మా ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎక్కడా రిపోర్ట్ అవలేదు. జాక్ మా ఒకవేళ భారత దేశ ప్రజలను ఉద్దేశించి అటువంటి వ్యాఖ్యలు చేసివుంటే, ఆ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ అనేక ప్రముఖ వార్త సంస్థలు రాసేవి. కానీ అటువంటి రిపోర్ట్స్ ఏవీ దొరకలేదు.

కోతి ముందు అరటిపండ్లు మరియు డబ్బు పెడితే, కోతి అరటిపండ్లను తీసుకుంటుందనే ఈ సందేశాన్ని అనేక విధమైన వెర్షన్లతో జాక్ మా పేరును జోడిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ సందేశాలని ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.  కానీ, ఈ సందేశాలని జాక్ మా ఇచ్చినట్టు మాకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు.

2014లో న్యూ ఢిల్లీలో నిర్వహించిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ అఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (FICCI) సమ్మిట్లో జాక్ మా మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉపన్యాసాలు ఉద్వేగభరితంగా మరియు స్పూర్తిదాయకంగా ఉంటాయని అన్నారు. నరేంద్ర మోదీపై హిందువుల వ్యతిరేకత గురించి కూడా జాక్ మా ఇటీవల ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

చివరగా, భారత జాతీయ భద్రతను ఉద్దేశించి గాని, నరేంద్ర మోదీపై హిందువుల వ్యతిరేకత గురించి గానీ జాక్ మా ఇటీవల ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll