Fake News, Telugu
 

లడఖ్‌లోని కుశోక్ బకుల రింపోచీ విమానాశ్రయాన్ని నిర్మించింది మోదీ ప్రభుత్వం కాదు

0

లడఖ్ రాజధాని లేహ్‌లోని కుశోక్ బకుల రింపోచీ విమానాశ్రయాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్మించినట్టు చెప్తున్న  పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: లడఖ్ రాజధాని లేహ్‌లోని కుశోక్ బకుల రింపోచీ విమానాశ్రయాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్మించింది.

ఫాక్ట్(నిజం): కుశోక్ బకుల రింపోచీ విమానాశ్రయాన్ని నిర్మించింది మోదీ ప్రభుత్వం కాదు. మోదీ ప్రభుత్వం ఇటీవల ఈ విమానాశ్రయంలో ఒక కొత్త టెర్మినల్‌ను నిర్మించింది. ఫిబ్రవరి 2019లో మోదీ ఈ పనులకు శంకుస్థాపన చేసింది. ఈ విమాశ్రయం 1985లోనే నిర్మించినట్టు వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

కుశోక్ బకుల రింపోచీ విమానాశ్రయం లడఖ్‌లోని ఏకైక కమర్షియల్ విమానాశ్రయం. ఇది సముద్ర మట్టానికి 10,682 అడుగుల ఎత్తులో ఉంది. పోస్టులో షేర్ చేసిన ఫోటో ఈ విమనశ్రయానిదే.

మోదీ ప్రభుత్వం కేవలం ఈ విమానాశ్రయానికి సంబంధించి ఒక కొత్త టెర్మినల్‌ను నిర్మిస్తోంది. ఫిబ్రవరి 2019లో మోదీ ఈ పనులకు శంకుస్థాపన చేసినట్టు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రెస్ రిలీజ్ ద్వారా తెలిపింది. మొత్తం 480 కోట్ల ఖర్చుతో ఈ టెర్మినల్‌ను నిర్మిస్తున్నారు. ఇదే విషయం AAI వార్షిక నివేధికలో కూడా ఉంది.

ఈ టెర్మినల్ నిర్మాణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ నిర్మాణానికి సంబంధించిన వార్తా కథనాలను క్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఈ కథనాలలో రిపోర్ట్ చేసిన దాని ప్రకారం కుషోక్ బకుల రింపోచీ ఎయిర్‌పోర్టును 1985లో నిర్మించారు.

మరికొన్ని కథనాలు, 1978లోనే ఈ ఎయిర్పోర్ట్ వాణిజ్య కార్యకలాపాలు మొదలు పెట్టిందని రిపోర్ట్ చేసాయి (ఇక్కడ మరియు ఇక్కడ). ఐతే ఈ సమాచారం ద్వారా ఎయిర్పోర్ట్ కట్టింది మోదీ ప్రభుత్వం మాత్రం కాదన్న విషయం మాత్రం స్పష్టమవుతుంది.

చివరగా, లడఖ్‌లోని కుశోక్ బకుల రింపోచీ విమానాశ్రయాన్ని నిర్మించింది మోదీ ప్రభుత్వం కాదు.

Share.

About Author

Comments are closed.

scroll