Fake News, Telugu
 

ప్రధాని మోదీ కరోనా వైరస్‌ని నియంత్రించగల సమర్ధుడని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు

0

“ఒక పైలట్ (అభినందన్) ని పాక్ బందీ చేస్తే, అతని కోసం పాక్ సరిహద్దులో 103 బ్రహ్మోస్ మిస్సైల్స్ పెట్టించాడు. ప్రపంచాన్ని ఏకం చేసి పాకిస్థాన్ కి చెమటలు పట్టించి అతన్ని క్షేమంగా విడిపించాడు. అలాంటిది, 130కోట్ల ప్రజలు కరోనా కోరల్లో చిక్కుకున్నప్పుడు తనవారికోసం ఏమైనా చేస్తాడు. ఆయన వ్యక్తి కాదు మహాశక్తి”, అని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నరేంద్ర మోదీని పొగిడిననట్టు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారత ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వైరస్‌ని నియంత్రించగల సమర్ధుడని పొగుడుతూ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు.

ఫాక్ట్ (నిజం): ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కరోనా నియంత్రణకు సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోదీని పొగుడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి న్యూస్ ఆర్టికల్స్, మీడియా చానల్స్ రిపోర్ట్ చేయలేదు. బెంజమిన్ నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేస్తూ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఎటువంటి ట్వీట్ పెట్టలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కరోనా నియంత్రణకు సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోదీని పొగుడుతూ ఈ వ్యాఖ్యలు చేసారా అని గూగుల్ లో వెతకితే, ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ఎటువంటి న్యూస్ ఆర్టికల్ పబ్లిష్ అవ్వలేదని తెలిసింది. ఒకవేళ నెతన్యాహు నరేంద్ర మోదీని పొగుడుతూ ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే, దేశంలోని అన్ని ప్రముఖ వార్తా పత్రికలు, మీడియా సంస్థలు ఆ విషయాన్నీ రిపోర్ట్ చేసేవి.

ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఈ వ్యాఖ్యలు చేసారా అని వెతికగా, అటువంటి ట్వీట్ ఏది బెంజమిన్ నెతన్యాహు చేయలేదని తెలిసింది. ‘PM of Israel’ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో కూడా ఈ వ్యాఖ్యలు చేస్తూ ఎటువంటి ట్వీట్ పెట్టలేదని తెలిసింది.

ఏప్రిల్ 2020లో తమ దేశానికి మెడికల్ సపోర్ట్ అందించినందుకు బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం, నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ పెట్టారు. దీనికి సంబంధించి పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు. అక్టోబర్ 2020లో నరేంద్ర మోదీ, బెంజమిన్ నెతన్యాహు మధ్య కరోనా వైరస్ ని నియంత్రణకు సంబంధించి చర్చలు కూడా జరిగాయి. ఈ చర్చలలో బెంజమిన్ నెతన్యాహు, నరేంద్ర మోదీ పైలట్ అభినందన్ ని విడిపించిన విధానం గురించి, కరోనా నియంత్రిస్తున్న తీరుని పొగుడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎక్కడా రిపోర్ట్ అవలేదు. 

చివరగా, భారత ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వైరస్‌ని నియంత్రించగల సమర్ధుడని పొగుడుతూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll