Fake News, Telugu
 

వాహనాలలో గరిష్ట పరిమితిలో పెట్రోల్/డీజిల్ నింపకూడదంటూ ఇండియన్ ఆయిల్ సంస్థ ఎటువంటి హెచ్చరిక జారీ చేయలేదు

0

అధిక ఉష్ణోగ్రతల కారణంగా వాహనాలలో పెట్రోల్ గరిష్ట పరిమితిలో కాకుండా కొంచెం తక్కువగా నింపాలని ఇండియన్ ఆయిల్ సంస్థ (IOCL) ఒక హెచ్చరిక జారీ చేసిందని చెప్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గరిష్టంగా పెట్రోల్ నింపడం వల్ల పేలుడు ప్రమాదాలు సంభవించే ఆస్కారం ఉన్నట్టు కూడా ఇండియన్ ఆయిల్ హెచ్చరించినట్టు పోస్టులో పేర్కొన్నారు. ఐతే ఈ కథనం ద్వారా పోస్టులో చెప్తున్నదానికి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: అధిక ఉష్ణోగ్రతల కారణంగా వాహనాలలో పెట్రోల్ గరిష్ట పరిమితిలో కాకుండా కొంచెం తక్కువగా నింపాలి –  ఇండియన్ ఆయిల్ సంస్థ హెచ్చరిక.

ఫాక్ట్ (నిజం): ఇండియన్ ఆయిల్ సంస్థ ఇలాంటి హెచ్చరిక ఏదీ జారీ చేయలేదు. ఈ వార్తకు తమ సంస్థతో ఎటువంటి సంబంధంలేదని ఇండియన్ ఆయిల్ సంస్థ 2018లోనే ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. ఇప్పుడు కూడా మళ్ళీ స్పష్టం చేసింది. గతంలో పలు సార్లు ఇదే వార్త వైరల్ అవడంతో, ఇండియన్ ఆయిల్ సంస్థ దీనిని ఖండించింది. పైగా ఆటోమొబైల్ తయారీదారులు తమ వాహనాలను అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని నిర్మిస్తారని, కాబట్టి శీతాకాలం లేదా వేసవి కాలంతో సంబంధం లేకుండా వాహనాలలో పూర్తి పరిమితిలో పెట్రోల్/డీజిల్ నింపుకోవచ్చని ఇండియన్ ఆయిల్ స్పష్టం చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఇండియన్ ఆయిల్ సంస్థ ఇలాంటి హెచ్చరికేది జారీ చేయలేదు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఇటీవల ఏప్రిల్‌లో ఇండియన్ ఆయిల్ సంస్థ ఒక ప్రకటన జారీ చేసింది. ఈ ప్రకటన ద్వారా వైరల్ అవుతున్న వార్త ఫేక్ అని, పెట్రోల్ లేదా డీజిల్‌ను ట్యాంక్ గరిష్ట పరిమితి వరకు నింపుకోవచ్చని తెలిపింది.

2018 మరియు 2019లో ఇదే వార్త వైరల్ అయినప్పుడు, ఈ హెచ్చరికకు తమకు ఎటువంటి సంబంధంలేదని, తాము ఇలాంటి హెచ్చరిక జారీ చేయలేదని ఇండియన్ ఆయిల్ సంస్థ ఒక ప్రకటన జారీ చేసింది.

పైగా ఆటోమొబైల్ తయారీదారులు తమ వాహనాలను అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని నిర్మిస్తారని, కాబట్టి శీతాకాలం లేదా వేసవితో సంబంధం లేకుండా వాహనాలలో పూర్తి పరిమితిలో పెట్రోల్/డీజిల్ నింపుకోవచ్చని, ఈ ప్రకటనలో  ఇండియన్ ఆయిల్ సంస్థ స్పష్టం చేసింది.

ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో బైకు పెట్రోల్ ట్యాంక్ పేలినట్టు కొన్ని కథనాలు (ఇక్కడ మరియు ఇక్కడ) ప్రచారం అయిన నేపథ్యంలో ఇలాంటి పోస్టులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. కాని ఇలా పెట్రోల్ ట్యాంక్ పూర్తిగా నింపినందుకు ఇలా పేలుడు సంభవిస్తుందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.

చివరగా, వాహనాలలో గరిష్ట పరిమితిలో పెట్రోల్/డీజిల్ నింపకూడదంటూ ఇండియన్ ఆయిల్ సంస్థ ఎటువంటి హెచ్చరిక జారీ చేయలేదు.

Share.

About Author

Comments are closed.

scroll