Fake News, Telugu
 

తవ్వకాల్లో బయటపడ్డ కుంభకర్ణుడి కత్తి ఫోటోలు అని చెప్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడి తయారు చేసిన ఫోటోలని షేర్ చేస్తున్నారు

0

కుంభకర్ణుడు వాడిన కరవాలం (కత్తి) ఇది నిపుణులు పరిశోధనలో తవ్వకాలలో దొరికింది,”అని చెప్తూ సోషల్ మీడియాలో ఒక పెద్ద కత్తి యొక్క నాలుగు ఫోటోలు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) వైరల్ అవుతున్నాయి. ఈ కత్తి, రామాయణం కాలం నాటిది అని, ఇది పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాల్లో బయటపడింది అని చెప్పి నెటిజన్లు క్లెయిమ్ చేస్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు. 

క్లెయిమ్: వైరల్ అవుతున్న ఈ ఫోటోలు రామాయణం కాలం నాటి కుంభకర్ణుడి కత్తిని చూపిస్తున్నాయి. ఈ కత్తి ఇటీవల ఒక పురావస్తు తవ్వకాల్లో బయటపడింది. 

ఫ్యాక్ట్(నిజం): ఈ ఫోటోలు అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వాడి తయారు చేసినవి. ఇలాంటి కత్తిని పురావస్తు శాఖ వారు తవ్వకాల్లో కనుగొన్నారు అని చెప్పడానికి ఎటువంటి విశ్వసనీయ ఆధారాలు లేవు. కావున, వైరల్ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ముందుగా, వైరల్ క్లైయిమ్‌ వెరిఫై చేయడానికి మేము ఇంటర్నెట్లో తగిన కీ వర్డ్స్ ఉపయోగించి వెతికాము. అసలు, రామాయణ కాలం నాటి కుంభకర్ణుడి కత్తిని పురావస్తు శాస్త్రవేత్తల తవ్వకాల్లో ఇటీవల కనుగొన్నారు అని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లభించలేదు.  

ఇంత పెద్ద పురాతన కాలం నాటి కత్తి నిజంగానే తవ్వకాల్లో బయటపడితే, ప్రధాన వార్తా సంస్థలు తప్పకుండా అలాంటి విషయం గురించి వార్తా కథనాలు పబ్లిష్ చేస్తాయి. కానీ, అలాంటి కథనాలేవీ మాకు లభించలేదు.

వైరల్ అవుతున్న ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వాడి తయారుచేసినవి అయ్యుండొచ్చు అనే అనుమానంతో, మేము వైరల్ ఫోటోలను ఒక్కొక్కటిగా ‘TrueMedia.org అనే AI జనరేటెడ్ ఫోటోలను కనిపెట్టే వెబ్‌సైట్‌లో చెక్ చేస్తే, ఈ ఫోటోలు అన్ని కూడా AI టెక్నాలజీ ద్వారా రూపొందించబడినవి అని రిపోర్ట్ వచ్చింది. ఈ రిపోర్టులు మీరు ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

దీనిబట్టి AI వాడి తయారు చేసిన ఫోటోలు షేర్ చేస్తూ, ఈ కత్తి రామాయణ కాలం నాటిది అని ఒక కల్పిత కథనం షేర్ చేస్తున్నారు అని మనకి స్పష్టంగా అర్థం అవుతుంది. ఇవే ఫొటోలని Hugging face వారి ‘Maybe’s AI Art Detector’ అనే టూల్ ఉపయోగించి చెక్ చేయగా. అందులో కూడా ఈ ఫోటోలు AI ద్వారా రూపొందించిన అని రిపోర్ట్ వచ్చింది. 

గతంలో కూడా ఇలాంటి నమ్మడానికి కష్టంగా ఉన్న ఫోటోలు, తవ్వకాల్లో బయటపడ్డ నిజమైన భారీ పుర్రెలు అని, పురాతన కాలం నాటి వింత జీవుల యొక్క నిజమైన ఫోటోలు అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు, అవి AI వాడి తయారు చేసిన ఫోటోలు అని చెప్తూ మేము ఆర్టికల్స్ పబ్లిష్ చేశాము. వాటిని మీరు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు.

 మన దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా ఇటువంటి పుకార్లు కాలంలో వచ్చాయి. టర్కీలో ఇటీవల 50 అడుగుల పొడవు గల 3000 ఏళ్ల పురాతన కత్తులు తవ్వకాల్లో బయట పడ్డాయి అని చెప్పి ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. కానీ ఇవన్నీ కూడా AI ద్వారా తయారు చేసిన ఫోటోలు అని చెప్తూ ‘Snopes’ అనే మీడియా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది.  

చివరగా, తవ్వకాల్లో బయటపడ్డ కుంభకర్ణుడు వాడిన కత్తి ఫోటోలు అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడి తయారుచేసిన ఫోటోలు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll