Coronavirus Telugu, Fake News, Telugu
 

కోవిడ్-19 వ్యాధి సోకకుండా ఉండటానికి ICMR ఇచ్చిన మార్గదర్శకాలు అంటూ పాత మెసేజ్ మళ్ళీ వైరల్

0

వచ్చే 6 నెలల నుండి 12 నెలల వరకు లాక్డౌన్ ఉండే అవకాశం లేదు.అందుకే ఈ జాగ్రత్తలు పాటించండి’, అని ICMR (ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్) న్యూఢిల్లీ వారు కోవిడ్-19 వ్యాధికి సంబంధించిన మార్గదర్శకాల లిస్ట్ ఇచ్చారని చెప్తూ, ఒక మెసేజ్ ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: కోవిడ్-19 వ్యాధి సోకకుండా ఉండటానికి ICMR న్యూఢిల్లీ ఇచ్చిన మార్గదర్శకాల లిస్ట్.

ఫాక్ట్: పోస్ట్ లోని మార్గదర్శకాల లిస్ట్ ని ICMR న్యూఢిల్లీ వారు ఇవ్వలేదు. 2020 లో ఈ మెసేజ్ గురించి ICMR వారిని FACTLY సంప్రదించగా, అలాంటి మార్గదర్శకాలు ఏవైనా ఉంటే వాటిని వారు తమ వెబ్ సైట్ లో కానీ, అధికారిక  సోషల్ మీడియా అకౌంట్ లో కానీ పెడతాము అని చెప్పారు. కానీ, అలాంటి లిస్ట్ ని వారు పెట్టినట్టు ఎక్కడా దొరకలేదు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.

పోస్ట్ లో ఇచ్చిన మార్గదర్శకాల లిస్ట్ గురించి ఇంటర్నెట్ లో వెతకగా, కోవిడ్-19 వ్యాధి సోకకుండా ఉండటానికి ICMR న్యూఢిల్లీ వారు అలాంటి మార్గదర్శకాల లిస్ట్ ని విడుదల చేసినట్టు ఎక్కడా ఎటువంటి సమాచారం దొరకలేదు. పోస్ట్ లోని కొన్ని మార్గదర్శకాలను మాత్రం నారాయణ హెల్త్ చైర్మన్ మరియు వ్యవస్థాపకులు డాక్టర్ దేవి శెట్టి మార్చి 2020 లో చెప్పినట్టు ‘టైమ్స్ అఫ్ ఇండియా’ ఆర్టికల్ లో చదవొచ్చు.

అయితే, ఇదే మెసేజ్ 2020 లో కూడా వైరల్ అయినప్పుడు, మెసేజ్ గురించి ICMR వారిని FACTLY సంప్రదించగా, అలాంటి మార్గదర్శకాలు ఏవైనా ఉంటే వాటిని వారు తమ వెబ్ సైట్ లో కానీ, అధికారిక  సోషల్ మీడియా అకౌంట్ లో కానీ పెడతాము అని చెప్పారు. అయితే, పోస్ట్ లోని మార్గదర్శకాల లిస్ట్ వారి సోషల్ మీడియా అకౌంట్లలో మరియు వెబ్ సైట్ లో ఎక్కడా కనిపించలేదు.

ICMR వెబ్ సైట్ లోని ఒక డాక్యుమెంట్ లో కోవిడ్-19 వ్యాధి సోకకుండా ఉండటానికి ఇచ్చిన మార్గదర్శకాలను ఇక్కడ చదవొచ్చు. కానీ, పోస్ట్ లోని లిస్ట్ మాత్రం వీటిలో లేదు.

ICMR తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ లోని కోవిడ్-19 మార్గదర్శకాలు తాముజారీ చేయలేదని, పోస్టులోని మార్గదర్శకాలు తమకు తప్పుగా ఆపాదిస్తున్నారని స్పష్టతని ఇచ్చారు.

చివరగా, పోస్ట్ లోని కోవిడ్-19 మార్గదర్శకాల లిస్ట్ ని ICMR న్యూఢిల్లీ వారు ఇవ్వలేదు.

వివరణ (MAY 07, 2021): ఈ ఆర్టికల్ ICMR 06 మే 2021న వివరణ ఇచ్చిన ట్వీట్ ద్వారా అప్డేట్ చేయటం జరిగింది.

Share.

About Author

Comments are closed.

scroll