Fake News, Telugu
 

హిందూ నవగ్రహాలను టెలిస్కోప్ సహాయం లేకుండా వివిధ సందర్భాల్లో కంటితోనే చూడవచ్చు

0

గెలీలియో 1609లో టెలీస్కోప్ కనిపెట్టాడు ఆ తర్వాత గ్రహాల గురించి తెలిసింది. అంతకంటే వేల సంవత్సరాలకు పూర్వమే హిందువులు నవగ్రహాల గురించి తెలిపారు ఇది ఎలా సాధ్యం?”, అని చెప్తూ ఒక పోస్ట్‌ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్‌లో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: టెలిస్కోప్ కనిపెట్టక ముందే వేల సంవత్సరాల ముందు హిందువులు నవగ్రహాల గురించి తెలిపారు.

ఫాక్ట్: టెలిస్కోప్ కనిపెట్టక ముందే వేల సంవత్సరాల ముందు హిందువులు నవగ్రహాల గురించి తెలిపిన మాట వాస్తవమే. అయితే, హిందూవుల నవగ్రహాలు మరియు ఆధునిక శాస్త్రవేత్తలు పరిగణించే గ్రహాల జాబితాలో తేడాలు ఉన్నాయి. ఉదాహరణకి, హిందువుల నవగ్రహాల్లో సూర్యుడు కూడా ఉంటాడు, కానీ ఆధునిక శాస్త్రవేత్తలు మాత్రం సూర్యుడిని నక్షత్రంలా చూస్తారు, గ్రహంగా పరిగణించరు. అంతేకాదు, హిందువులు నవగ్రహాలుగా పరిగణించేవాటిని టెలిస్కోప్ సహాయం లేకుండా, వివిధ సందర్భాల్లో కంటితోనే చూడవచ్చు. కావున, పోస్ట్‌లో చెప్పింది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

పోస్ట్‌లో చెప్పిన విషయం గురించి ఇంటర్నెట్‌లో వెతకగా, టెలిస్కోప్ కనిపెట్టక ముందే వేల సంవత్సరాల ముందు హిందువులు నవగ్రహాల గురించి తెలిపిన మాట వాస్తవమేనని తెలిసింది. నవగ్రహాల పేర్లను ఇక్కడ చదవచ్చు – సూర్యుడు, చంద్రుడు,  అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహు, మరియు కేతు. అయితే, హిందూవుల నవగ్రహాలు మరియు ఆధునిక శాస్త్రవేత్తలు పరిగణించే గ్రహాల జాబితాలో తేడాలు ఉన్నాయి.

హిందువుల నవగ్రహాల్లో సూర్యుడు కూడా ఉంటాడు, కానీ ఆధునిక శాస్త్రవేత్తలు మాత్రం సూర్యుడిని నక్షత్రంలా చూస్తారు, గ్రహంగా పరిగణించరు. చంద్రుడుని కూడా గ్రహంగా పరిగణించరు. ఆధునిక శాస్త్రవేత్తలు గ్రహాలుగా పరిగణించే యురేనస్ మరియు నెప్ట్యూన్ గ్రహాలు హిందూ నవగ్రహాల్లో లేవు. అంతేకాదు, రాహు మరియు కేతువులు కూడా జరిగే ఘటనలు, గ్రహాలు కాదు.

హిందువులు నవగ్రహాలుగా పరిగణించేవాటిని టెలిస్కోప్ సహాయం లేకుండా, వివిధ సందర్భాల్లో కంటితోనే చూడవచ్చు. వాటికి సంబంధించిన వివరాలను ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. కంటికి కనిపించే గ్రహాలే నవగ్రహాల్లో కూడా ఉన్నట్టు గమనించవచ్చు.

చివరగా, హిందూ నవగ్రహాలను టెలీస్కోప్ సహాయం లేకుండా వివిధ సందర్భాల్లో కంటితోనే చూడవచ్చు

Share.

About Author

Comments are closed.

scroll