Fake News, Telugu
 

మహిళలకు ఉచిత రైడ్ స్కీమ్‌ హెల్ప్‌లైన్ నంబర్లు (1091 మరియు 7837018555) లూథియానా (పంజాబ్) కు మాత్రమే పరిమితం

0

హైద్రాబాద్ లో ఇటీవల జరిగిన దిశ దుర్ఘటన తరువాత వివిధ రాష్ట్రాల పోలీసులు స్త్రీల సురక్షణ  కోసం ఒక  ‘ఉచిత రైడ్’  స్కీమ్‌ ని ప్రారంభించారని, ఎవరైనా స్త్రీ కి రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్య  తన ఇంటికి  వెళ్ళడానికి వాహనం దొరకకపోతే  హెల్ప్ లైన్ నంబర్లు 1091 కైనా, 783701855 కైనా డయల్ చేసి ఇంటి దగ్గర దిగబెడతారు అని క్లెయిమ్ చేస్తూ ఒక పోస్ట్ ఫేస్బుక్ లో విస్తృతంగా ప్రచారం కాబడుతుంది. ఆ పోస్ట్ లోని క్లెయిమ్ లో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పోలీసులు రాత్రి పూట ప్రయాణించే స్త్రీల రక్షణ కోసం ఒక ‘ఉచిత రైడ్’ స్కీమ్‌ ని ప్రారంభించారు. దాని హెల్ప్ లైన్ నంబర్లు 1091 మరియు 7837018555.

ఫాక్ట్ (నిజం): 1091 మరియు 7837018555 హెల్ప్ లైన్ నెంబర్లని లూథియానా పోలీసులు ఎవరైనా స్త్రీలకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు తమ ఇంటికి వెళ్ళడానికి వాహనం దొరకక పోతే ఏర్పాటు చేసిన ‘ఉచిత రైడ్’ స్కీమ్‌ కి సంబంధించినది. ఒంగోలు పోలీసులు కూడా ఇలాంటి సేవ నే ప్రారంభించారు, కానీ ఆ సర్వీస్ హెల్ప్ లైన్ నెంబర్ ‘100’. కావున, పోస్ట్ లోని క్లెయిమ్ అబద్ధం తప్పు.

గూగుల్ లో ‘హెల్ప్ లైన్ నెంబర్ 783701855’ గురించి వెతికితే వచ్చిన సెర్చ్ రిజల్ట్స్ ప్రకారం అది లూథియానా పోలీసులు స్త్రీలు రాత్రి ప్రయాణించేటప్పుడు సురక్షితంగా ఉండాలనే ఉద్దేశం తో ప్రారంభించిన ‘ఉచిత రైడ్’ స్కీమ్‌ కి సంబంధించినవి అని తెలిసింది. ‘Hindustan Times’ ఆర్టికల్ లోని సమాచారం ప్రకారం లూథియానా (పంజాబ్) పోలీసులు ఒక ‘ఉచిత రైడ్’ స్కీమ్‌ ని ప్రారంభించారని, ఎవరైనా స్త్రీలకు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రయాణించేటప్పుడు తమ ఇంటికి చేరడానికి వాహనం దొరకకపోతే 1091, 112 లేదా, 783701855 హెల్ప్ లైన్ నెంబర్లకి డయల్ చేసి ఉచిత రైడ్ ని తీసుకోవచ్చు అని తెలుస్తుంది.

పోస్టులో పేర్కొన్నట్టు ఒంగోలులో స్త్రీల కోసం ఇలాంటి సేవని ఏదయినా ప్రారంబించారేమో అని గూగుల్ లో వెతికితే ‘The Hindu’ దినపత్రిక ప్రచురించిన ఆర్టికల్ లభించింది, దాని ప్రకారం ఒంగోలు లో కూడా పోలీసులు ఇలాంటి స్కీమ్‌ నే ప్రారంభించారని, కాకపోతే ఆ స్కీమ్‌ యొక్క హెల్ప్ లైన్ నెంబర్ ‘100’ అని తెలుస్తుంది.

చివరగా, లూథియానా పోలీసులు రాత్రి ప్రయాణించే  స్త్రీల సురక్షణకై ప్రారంభించిన ఉచిత రైడ్ స్కీమ్‌ హెల్ప్ లైన్  నంబర్లని (1091 మరియు 7837018555 ) ఇతర రాష్ట్రాల పోలీసులు స్త్రీల కోసం ప్రారంభించిన ఉచిత రైడ్ స్కీమ్‌ హెల్ప్ లైన్ నంబర్లు అంటూ తప్పు ప్రచారం చేస్తున్నారు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll