Fake News, Telugu
 

Gulch అనే అమెరికా కంపెనీ తయారు చేసిన ముసుగు డిజైన్ ప్రకటన ఫోటోను చూపిస్తూ LOC సరిహద్దుల్లో పహారా కాస్తున్న భారత సిపాయి అని షేర్ చేస్తున్నారు

0

శత్రువులను మభ్యపెట్టడానికి ఉపయోగించే ముసుగు డ్రెస్ ధరించి ఉన్న సైనికుడి ఫోటోని చూపిస్తూ LOC సరిహద్దుల్లో పహారా కాస్తున్న ఘాతక్ కమాండో యూనిట్ కి చెందిన భారత సిపాయి, అంటూ షేర్ చేస్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: LOC సరిహద్దుల్లో ముసుగు డ్రెస్ ధరించి పహారా కాస్తున్న భారత సిపాయి ఫోటో.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో, Gulch అనే అమెరికాకి చెందిన వస్త్ర కంపెనీ తయారు చేసిన ‘Cross Cover Brown Camouflage’ పాటర్న్ కి సంబంధించిన ప్రకటన ఫోటో అని విశ్లేషణలో తెలిసింది. ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి భారత సిపాయి కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, Pinterest ఇమేజ్ ప్లాట్ఫారం లో ఈ ఫోటో దొరికింది. Gulch Gear వారు Pinterest లోని తమ కలెక్షన్స్ లో ఈ ఫోటోని జత చేసారు. ఫోటోలోని ఈ ముసుగు డ్రెస్ తాము తయారు చేసిన ‘Cross Cover Brown Camouflage డిజైన్ పాటర్న్ కు సంబంధించినది అని అందులో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా Gulch అధికారిక వెబ్సైటులో వెతకగా, పోస్టులోని అదే ఫోటో Gulch వెబ్సైట్ హోం పేజిలో దొరికింది. ఇదే ఫోటోని తమ అధికారిక ఫేస్బుక్ అకౌంట్లో మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కూడా పోస్ట్ చేసారు. అవి ఇక్కడ మరియు ఇక్కడ మనం చూడవచ్చు. అమెరికాకి చెందిన ఈ Gulch వస్త్ర కంపెనీ శత్రువులను మభ్యపెట్టడానికి ఉపయోగించే తేలికైన ముసుగు డ్రెస్సులని తయారు చేస్తుంది.

చివరగా, Gulch అనే అమెరికా కంపెనీ తయారు చేసిన ముసుగుల డ్రెస్ ప్రకటన ఫోటోను చూపిస్తూ LOC సరిహద్దుల్లో పహారా కాస్తున్న భారత సిపాయి ఫోటో అని షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll